13 ఏళ్లలోనే బ్రిటన్ క్వీన్ ప్రేమ.. పెళ్లి.. ఈ రాజ కుటుంబం ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ మీకోసం..

First Published Apr 10, 2021, 12:31 PM IST

బ్రిటిష్ రాజకుటుంబానికి చెందిన ప్రముఖ వ్యక్తి, క్వీన్ ఎలిజబెత్ II భర్త ప్రిన్స్ ఫిలిప్ 99 సంవత్సరాల వయసులో శుక్రవారం మరణించారు. బ్రిటన్ మహారాణి క్వీన్ ఎలిజబెత్ II పట్ల అతని ప్రేమ ఎలా మొదలైంది ?  ఆ రాజ కుటుంబంలో  ఒకరిగా ఎలా ఆయ్యాడు? ఈ ఆసక్తికరమైన  రాజ కుటుంబ ప్రేమకథ చూస్తే చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.

ప్రిన్స్ ఫిలిప్ బ్రిటన్ దేశానికి రాక ముందు వారి కుటుంబాన్ని గ్రీస్ దేశం నుండి బహిష్కరించబడింది. ఆ తరువాత అతని కుటుంబం ఐరోపాలోని వివిధ దేశాలలో నివసించింది. ప్రిన్స్ చదువు కోసం బ్రిటన్ వచ్చాక మొదట రాయల్ నేవీ కాలేజీలో చేరాడు. ఆ తరువాత మెల్లిమెల్లిగా అతను బ్రిటన్ రాయల్ నేవీలో సభ్యుడయ్యాడు, అలాగే ప్రపంచ యుద్ధంలో కూడా ప్రిన్స్ ఫిలిప్ పాల్గొన్నాడు.
undefined
ప్రస్తుతం ఆయన వయస్సు 99 సంవత్సరాలు, బ్రిటిష్ మహారాణి క్వీన్ ఎలిజబెత్ II జీవిత భాగస్వామిగా 74 సంవత్సరాలు ఉన్నారు. లండన్‌కు చెందిన బకింగ్‌హామ్ ప్యాలెస్ ఈ సమాచారం ఇచ్చింది. ప్రిన్స్ ఫిలిప్‌ను డ్యూక్ ఆఫ్ ఎడిన్‌బర్గ్ అని కూడా పిలుస్తారు. గత ఏడాది నవంబర్‌లో వారు తమ 73వ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు.
undefined
1939 లో జార్జ్ VI, ప్రస్తుత మహారాణి తల్లి క్వీన్ ఎలిజబెత్ లండన్ లోని రాయల్ నావల్ కాలేజీని సందర్శించినట్లు నాలుగు కథనాలు వినిపిస్తుంటాయి. కాలేజీని సందర్శించిన సమయంలో వీరితో పాటు తమ ఇద్దరు కుమార్తెలు ఎలిజబెత్, మార్గరెట్ కూడా ఉన్నారు. ఈ రాజ అతిథులను స్వాగతించడానికి నావల్ కళాశాల ప్రిన్స్ ఫిలిప్‌ను నియమించింది. ఆ సమయంలోనే 13 ఏళ్ల ఎలిజబెత్, ప్రిన్స్ ఫిలిప్‌ కళ్ళు కలిశాయి. దీని తరువాత ఇద్దరి మధ్య ప్రేమలేఖలు చాలా సంవత్సరాలు కొనసాగింది.
undefined
1946 లో కింగ్ జార్జ్ చివరికి, 1946 లో ప్రిన్స్ ఫిలిప్ ప్రేమని కింగ్ జార్జ్ అంగీకరించారు. దీనికి ముందే ఎలిజబెత్ ప్రిన్స్ ఫిలిప్‌కు లవ్ ప్రోపోజ్ చేసినట్లు కొందరు చెబుతుంటారు. ప్రిన్స్ ఫిలిప్ ప్రతిపాదనకు జార్జ్ అంగీకరించిన తరువాత ఎలిజబెత్ 21 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు మాత్రమే నిశ్చితార్థం కార్యక్రమం జరుగుతుందని కింగ్ జార్జ్ షరతు పెట్టాడు.
undefined
వీరి వివాహం రేడియోలో ప్రసారంప్రిన్స్ ఫిలిప్, ఎలిజబెత్ నిశ్చితార్థం 10 జూలై 1947న ప్రకటించారు. తరువాత 20 నవంబర్ 1947న వెస్ట్ మినిస్టర్ అబ్బేలో వివాహం చేసుకున్నారు. వీరి వివాహం ప్రపంచవ్యాప్తంగా రేడియో ద్వారా ప్రసారం చేయబడింది.
undefined
undefined
click me!