భారతదేశంలోని ఈ రాజ కుటుంబీకులు ఇప్పటికీ తరిగిపోని సంపదతో జీవిస్తున్నారు.. ఎలా అంటే ?

First Published Apr 9, 2021, 6:25 PM IST

భారతదేశాన్ని రాజులు, చక్రవర్తులు పరిపాలించిన సంగతి మీకు తెలిసే ఉంటుంది. పురాతనంలో భారతదేశాన్ని చాలా మంది రాజులు పరిపాలించారు. భారతదేశానికి స్వతంత్రం వచ్చి కూడా 70 ఏళ్ళు పైగానే కావొస్తుంది. 
 

కానీ నేటికీ రాజ కుటుంబాలు ఉన్నాయి అంటే మీరు ఆశ్చర్యపోవచ్చు. అవును ఇది నిజమే.. ఇప్పటికీ కొంతమంది రాజ వంశ్యనికి చెందిన వారు చక్రవర్తుల జీవితాన్ని గడుపుతున్నారు. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్న భారతదేశంలోని కొందరి రాజ గృహాల గురించి మీకు తెలుసుకుందాం...
undefined
వాడియార్ రాజవంశంఈ రాజ కుటుంబం మైసూర్‌కు చెందినది, వీరికి సుమారు 10 వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని చెబుతుంటారు. ప్రస్తుతం యుద్వీర్ వాడియార్ రాజవంశంకి చెందిన 27వ రాజు. ఈయన దుంగార్పూర్ చెందిన యువరాణి త్రిశకాను వివాహం చేసుకున్నారు. ఈ కుటుంబం ఇప్పటికీ రాజులగే జీవిస్తుంది ఇంకా విలాసవంతమైన జీవితానికి ప్రసిద్ధి చెందారు.
undefined
పటౌడీ నవాబులుమన్సూర్ అలీ ఖాన్ పటౌడీ నవాబ్, ఈయన ఒక మాజీ క్రికెటర్ కూడా. అతను బాలీవుడ్ నటి షర్మిలా ఠాగూర్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ మన్సూర్ అలీ ఖాన్ కుమారుడు. అంతేకాదు సైఫ్ అలీ ఖాన్ పటౌడీ ప్యాలెస్ యజమాని కూడా.
undefined
మేవార్ రాజవంశంఅరవింద్ సింగ్ మేవార్ ఒకప్పటి రాజు భగవత్ సింగ్ కుమారుడు. ఇతను చాలా పెద్ద కార్యక్రమాలలో కనిపిస్తుంటాడు. అరవింద్ సింగ్‌కు పోలో, క్రికెట్ ఆడటం చాలా ఇష్టం. అరవింద్ సింగ్ మేవార్ రాజవంశనికి చెంసిన 76వ వారసుడని చెబుతుంటారు. అతని భార్య కచ్ యువరాణి విజయరాజ్. వీరికి ఒక కుమారుడు లక్ష్‌రాజ్ రాజ్, కుమార్తె పద్మజా ఉన్నారు. అరవింద్ సింగ్ కి లగ్జరీ కార్లు, విలాసవంతమైన బంగ్లా కూడా ఉంది.
undefined
జోధ్ పూర్ రాథోడ్నేటికీ రాథోడ్ కుటుంబానికి చెందిన వారసులు జోధ్ పూర్ లో నివసిస్తున్నారు. మొరన్‌ఘన్ కోటతో పాటు అతనికి ఉమైద్ భవన్ ప్యాలెస్‌కు కూడా ఉంది. ప్రస్తుతం మహారాజా గజ్ సింగ్ తన భార్య, ఇద్దరు పిల్లలతో ఉమైద్ భవన్ ప్యాలెస్‌లో ఉంటున్నారు. ప్యాలెస్‌లో కొంత భాగం పర్యాటకుల కోసం కేటాయించారు అయితే, మిగిలిన భాగాన్ని తాజ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ నిర్వహిస్తుంది అది కూడా కుటుంబ భాగస్వామ్యంతో నడుస్తుంది.
undefined
click me!