'మానవ రక్తంతో' షూస్ తయారి.. లాంచ్ చేసిన వెంటనే భారీ అమ్మకాలు.. వీటి ధర ఎంతంటే ?

First Published Apr 10, 2021, 11:26 AM IST

డెవిల్ షూస్‌ను  తయారీకి యుఎస్ కంపెనీ నైక్ దావా వేసిన తరువాత బ్రూక్లిన్  చెందిన పాదరక్షల సంస్థ ఎంఎస్‌సిహెచ్ఎఫ్ రాజీ పడాలని నిర్ణయించింది. 

శుక్రవారం విడుదల చేసిన ఒక ఇమెయిల్‌లో డెవిల్స్ షూస్ లేదా ఇంతకుముందు లాంచ్ చేసిన జీసస్ షూస్‌ను కొనుగోలు చేసిన వినియోగదారులకు రిటైల్ ధరతో పాటు షిప్పింగ్ చార్జీలను తిరిగి చెల్లించాలని కంపెనీ వెల్లడించింది.
undefined
ఎంఎస్‌సిహెచ్‌ఎఫ్ శుక్రవారం మాట్లాడుతూ, 'మేము నైక్ వేసిన దావాను పరిష్కరించడానికి అంగీకరించాము. ఇందుకు వారు మార్కెట్లో చెలామణి అవుతున్న సాతాన్ షూస్‌ డెవిల్ షూస్‌ను తొలగించమని నైక్ కంపెనీ కోరింది ఇందుకు మేము అంగీకరించాము తెలిపింది.
undefined
విశేషమేమిటంటే ఎంఎస్‌సిహెచ్‌ఎఫ్ చేత తయారు చేయబడిన డెవిల్ షూస్ గత నెల చివరిలో అంటే మార్చి 29న లాంచ్ చేసిన వెంటనే అమ్ముడయ్యాయి. ఈ షూలలో మొత్తం 666 జతలను మాత్రమే కంపెనీ తయారు చేసింది. ఒక జత షూస్ ధర 1018 డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో 75 వేల రూపాయలు.
undefined
ఈ డెవిల్ షూను లాంచ్ చేసిన తరువాత వాటిని తయారు చేయడానికి మానవ రక్తం ఉపయోగించినట్లు నైక్ పేర్కొంది. ఈ బూట్లపై స్వూష్ లోగోను ఎంఎస్‌సిహెచ్‌ఎఫ్ ఉపయోగించారని ఆరోపిస్తూ నైక్ ఒక దావా వేసింది. అనుమతి లేదా భాగస్వామ్యం లేకుండా తమ లోగోను షూపై ఉంచారని నైక్ ఆరోపించింది. ప్రసిద్ధ రాపర్ లిల్ నాస్ సహకారంతో ఈ బూట్లు రూపొందించినట్లు నైక్ తెలిపింది.
undefined
సాతాను షూస్‌పై సోషల్ మీడియాలో కూడా వివిధ రకాలుగా చేర్చించారు. ఈ బూట్లపై క్రాస్ మార్క్ తలక్రిందులుగా ఉందని అంతే కాకుండా పెంటాగ్రామ్ కూడా ఉందని అన్నారు. అలాగే బైబిలు కూడా లూకా 10:18 గురించి ప్రస్తావించింది. చాలా మంది వినియోగదారులు దీనిని దేవుని వాక్యాన్ని అవమానించడం అని ఆరోపించారు. ఈ బూట్లు తయారు చేయడానికి మానవ రక్తం చుక్క కూడా ఉపయోగించబడిందని పేర్కొన్నారు.
undefined
అయితే ఎంఎస్‌సిహెచ్‌ఎఫ్ ఇలాంటి వివాదాలలో చిక్కుకోవడం ఇదేం మొదటిసారి కాదు. అంతకుముందు 2019 సంవత్సరంలో కంపెనీ జీసస్ షూస్‌ను ప్రారంభించింది, ఈ కారణంగా కూడా చాలా విమర్శలను ఎదుర్కొంది. జోర్డాన్ నది నుండి తెచ్చిన పవిత్ర జలాన్ని ఈ బూట్ల తయారీకి ఉపయోగించారని ఆ సమయంలో కంపెనీ పేర్కొంది. ఈ విషయంపై చాలా వివాదాలు ఉన్నాయి.
undefined
click me!