గోల్డెన్ ఛాన్స్ : ఇంట్లో కూర్చొని లక్షలు సంపాదించే అవకాశం.. ఏం చెయ్యాలంటే ?

First Published | Jul 29, 2021, 12:26 PM IST

  మీలో ఉన్న క్రియేటివ్ టాలెంట్ తో ఇంట్లో కూర్చొని డబ్బు సంపాదించాలనుకుంటున్నారా.. అయితే  రూ .15 లక్షలు సంపాదించడానికి ప్రభుత్వం సామాన్య ప్రజలకు అద్భుత అవకాశం ఇచ్చింది. మీ ప్రతిఒక్కరికీ  ఒక సువర్ణావకాశం. 

ఇందుకు మీరు ఆగస్టు 15 లోగా ఒక పోటీలో పాల్గొనవలసి ఉంటుంది. అయితే విజేతలకు బహుమతిగా రూ .2 లక్షల నుండి రూ .15 లక్షల వరకు మొత్తాన్ని గెలుచుకోవచ్చు. అంటే మోడీ ప్రభుత్వం చొరవను సద్వినియోగం చేసుకొని మీరు లక్షాధికారి కావచ్చు.  ప్రభుత్వ ప్రణాళిక ఏమిటంటే మౌలిక సదుపాయాల నిధుల కోసం ప్రత్యేకంగా అభివృద్ధి ఆర్థిక సంస్థ (డిఎఫ్‌ఐ) ను రూపొందించే ప్రణాళికలను కేంద్ర బడ్జెట్ 2021లో ప్రకటించింది. నేషనల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పైప్‌లైన్ (ఎన్‌ఐపి) కింద 2024-25 నాటికి 7000కి పైగా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై రూ .111 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టాలని కేంద్రం యోచిస్తోంది.
అభివృద్ధి ఆర్థిక సంస్థ (డిఎఫ్‌ఐ) కోసం పేరు, ట్యాగ్‌లైన్ సూచించాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ దేశ పౌరులను కోరింది. పైన పేర్కొన్న వాటికి స్ఫూర్తిని సూచించే లోగోను కూడా రూపొందించమని కోరింది. అంటే డెవలప్‌మెంట్ ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్ ఏర్పాటు వెనుక ఉన్న ఉద్దేశాన్ని సూచించాలి అలాగే డిఎఫ్‌ఐ ఏం చేస్తుందో లేదా ఏం చేయగలదో స్పష్టంగా తెలియజేయలీ. ఇంకా చూడడానికి ఒక సిగ్నేచర్ లాగా ఉండాలి దీనితో గుర్తుంచుకోవడం, పలకడం కూడా సులభంగా ఉండాలి.

ఇందులో పాల్గొనడానికి మీరు Mygov.inకు లాగిన్ అవ్వాలి. తరువాత ఇక్కడ పార్టిసిపేట్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. మీ సమాచారాన్ని అందించిన తరువాత, మీ ఎంట్రీని రిజిస్టర్ చేయండి. పోటీ కోసం ఎంట్రీల రిజిస్ట్రేషన్ అండ్ సబ్మిషన్ చివరి తేదీ ఆగస్టు 15. ప్రతి ఒక్కరి సూచనల సృజనాత్మకత, లైవ్లీ నెస్, విషయంతో నిమగ్నమయ్యే సామర్థ్యంపై అంచనా వేయబడుతుంది. సిటిజెన్స్, స్టేక్ హోల్దర్స్ న్యూ ఇండియా స్ఫూర్తిని ప్రతిబింబించాలి.
మూడు వేర్వేరు క్యాటగిరిలకు ఈ ప్రైజ్ మని ఇవ్వనున్నారు. ఇంకా ప్రైజ్ మని కూడా ఈ మూడు వేర్వేరు క్యాటగిరిలకు భిన్నంగా ఉంటుంది. మీరు ఈ మూడు విభాగాలలో మొదటి స్థానాన్ని దక్కించుకుంటే, మీకు రూ .15 లక్షల బహుమతి లభిస్తుంది.

Latest Videos

click me!