బయోమెట్రిక్, స్కానింగ్ లేకుండా పిల్లల కోసం కొత్త ఆధార్ కార్డు.. ఈ విషయాలను తెలుసుకోండి..

First Published Jul 28, 2021, 2:24 PM IST

ప్రతి భారతీయ పౌరుడికి ఆధార్ కార్డు ఎంతో ముఖ్యం. ఆధార్ కార్డు కేవలం ఒక డాక్యుమెంట్ మాత్రమే కాదు, ఒక గుర్తింపు కార్డు కూడా. ఏదైనా ఆర్థిక లావాదేవీలు, ప్రభుత్వ పథకాలను పొందటానికి ఆధార్ చాలా ముఖ్యం. ఆధార్ లో  మీ చిరునామా సమాచారం మాత్రమే కాకుండా ఒక వ్యక్తి బయోమెట్రిక్ సమాచారం కూడా ఉంటుంది. 

ఆధార్ కార్డు జారీ చేసే సంస్థ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యుఐడిఎఐ) 5 సంవత్సరాల లోపు పిల్లల కోసం ఆధార్‌ను తయారుచేసే సదుపాయాన్ని అందిస్తుంది. అవును.. ఇప్పుడు మీరు మీ పిల్లల కోసం బాల్ ఆధార్ తయారు చేయావచ్చు. అయితే ఈ పిల్లల ఆధార్ కార్డు నీలం రంగులో ఉంటుంది.
undefined
మీ పిల్లలు ఐదేళ్ల లోపు ఉంటే, మీరు వారి కోసం బాల్ ఆధార్ తయారు చేసుకోవచ్చు. బాల్ ఆధార్ కోసం పిల్లల గుర్తింపు ఎక్కడ అవసరమో వారి తల్లిదండ్రులు అతనితో పాటు ఉండాలి. అయితే పిల్లలకి ఐదేళ్లు నిండినప్పుడు వారు సమీపంలోని ఆధార్ కేంద్రానికి వెళ్లి ఆధార్ నంబర్‌తో బయోమెట్రిక్ వివరాలను రిజిస్టర్ చేయాలి.
undefined
ఐదేళ్ల లోపు పిల్లలకు ఫింగర్ ప్రింట్, ఐ స్కాన్ ఉండవని యుఐడిఎఐ ట్వీట్ ద్వారా తెలిపింది. పిల్లల వయస్సు ఐదు నుండి 15 సంవత్సరాల మధ్య ఉన్నప్పుడు వారి బయోమెట్రిక్ అప్ డేట్ చేయబడుతుంది. మీరు పిల్లల ఆధార్‌ను ఎలా పొందవచ్చో, బయోమెట్రిక్ వివరాలను రిజిస్టర్ చేయడానికి ఉచితంగా అపాయింట్‌మెంట్ ఎలా పొందాలో తెలుసుకోండి.
undefined
బాల్ ఆధార్ కోసం మొదట మీరు మీ పిల్లలతో ఆధార్ రిజిస్టర్ కేంద్రాన్ని సందర్శించి ఒక ఫారమ్ నింపాలి.  అలాగే పిల్లల బర్త్ సర్టిఫికేట్ కేంద్రానికి తీసుకెళ్లడం అవసరం.  పిల్లల ఫోటో ఆధార్ కేంద్రంలో తీసుకుంటారు. పిల్లల ఆధార్ తల్లిదండ్రులలో ఒకరి ఆధార్ కార్డుతో ముడిపడి ఉంటుంది. మీరు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను కూడా వెల్లడించాలి. వెరిఫికేషన్ అండ్ రిజిస్టర్ తరువాత కన్ఫర్మేషన్ మెసేజ్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కి వస్తుంది.  కన్ఫర్మేషన్ మెసేజ్ వచ్చిన 60 రోజుల్లో బాల్ ఆధార్ మీ రిజిస్టర్డ్ చిరునామాకు వస్తుంది.
undefined
బయోమెట్రిక్ వివరాలను రిజిస్టర్ చేయడానికి మీరు ఆన్‌లైన్ అపాయింట్‌మెంట్ ఉచితంగా చేసుకోవచ్చు. ఆన్‌లైన్ అపాయింట్‌మెంట్ తీసుకోవడానికి మీరు మొదట UIDIA వెబ్‌సైట్ https:uidai.gov.in ని సందర్శించాలి .  వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా మీరు 'మై ఆధార్' టాబ్‌పై క్లిక్ చేయాలి, తర్వాత మీకు అపాయింట్‌మెంట్ బుక్ చేసుకునే అవకాశం లభిస్తుంది. ఇక్కడ మీరు లొకేషన్ ఆప్షన్ పొందుతారు, అందులోంచి మీ నగరాన్ని సెలెక్ట్ చేసుకోండీ నగరాన్ని ఎంచుకున్న తరువాత అపాయింట్‌మెంట్ బుక్ చేయడానికి ప్రాసెస్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు మీ ముందు కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. దీనిలో కొన్ని ఆప్షన్స్, ఆధార్ అప్ డేట్ వివరాల ఆప్షన్స్ లో దేనినైనా ఎంచుకోవచ్చు. ఆప్షన్స్ ఎంచుకున్న తరువాత మీరు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, క్యాప్చా కోడ్, ఓ‌టి‌పిని ఎంటర్ చేయాలి, ఆ తర్వాత మీ అప్లికేషన్ వేరిఫై అవుతుంది. ఈ సమయంలో మీరు అపాయింట్‌మెంట్ కోసం టైమ్ స్లాట్‌ను కూడా ఎంచుకోవాలి. ఇవన్నీ చేసిన తరువాత సబ్మిట్ పై క్లిక్ చేయండి. దీని కోసం ఎటువంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు.
undefined
click me!