ముఖ్యంగా గత పది సంవత్సరాల్లో బంగారం ధర దాదాపు రెండింతలు అయింది. 2013లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు గాను 29 వేల రూపాయలు చెల్లించాల్సి వచ్చింది. అదే 2023 సంవత్సరానికి వచ్చేటప్పటికి 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు గాను 62 వేల రూపాయలు చెల్లించాల్సి వస్తోంది. అంటే దాదాపు మీరు డబుల్ లాభం పొందినట్లు. ఈ లెక్కన 20 సంవత్సరాల క్రితం అంటే, 2003లో బంగారం కొనుగోలు చేసినప్పుడు, కేవలం 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు గాను రూ.5 వేల రూపాయలు మాత్రమే ఉంది. దాని విలువ ప్రస్తుతం 2023లో 62 వేలకు చేరింది అంటే దాదాపు 12 రెట్లు పెరిగింది అని అర్థం.