Gold Rate: మన దేశంలో బంగారం ధర జెట్ స్పీడులో తులం రూ. 1 లక్ష తాకడం ఖాయం, పసిడి ధర పరుగులకు అమెరికానే కారణమా ?

First Published | May 25, 2023, 1:08 AM IST

బంగారం ధరలు అతి త్వరలోనే ఒక లక్ష రూపాయలు తాకడం పెద్ద ఆశ్చర్యమేమీ కాదని నిపుణులు అంచనా వేస్తున్నారు దీనికి కారణాలు చెబుతూ ప్రస్తుతం అమెరికాలో నెలకొన్నటువంటి ఆర్థిక సంక్షోభం ఎంత జటిలం అయితే, బంగారం ధర అంత పెరుగుతుందని బులియన్ పండితులు అంచనా వేస్తున్నారు.

బంగారం ధర గడచిన నెల రోజులుగా గమనించినట్లయితే స్థిరంగానే ఉంది. పెద్దగా అటుపోట్లు కనిపించడం లేదు. అయితే ఇక్కడి నుంచి బంగారం ధర రాకెట్ కన్నా వేగంగా దూసుకెళ్లే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇందుకు కారణం కూడా లేకపోలేదు. అంతర్జాతీయంగా గమనించినట్లయితే, ప్రస్తుతం ఒక ఔన్స్ ( 31 గ్రాములు) బంగారం ధర 1965 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.

మే నెలలోనే బంగారం ధర గరిష్టంగా 2050 డాలర్ల వరకు పెరిగింది. అక్కడి నుంచి నెమ్మదిగా బంగారం ధర తగ్గుతూ ప్రస్తుతం 1965 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.  అయితే రాబోయే కాలం పసిడి ప్రేమికులకు దుర్వార్త అని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే అమెరికా ఆర్థిక సంక్షోభమే దీనికి మూల కారణం కాబోతోందని అంచనా వేస్తున్నారు.


ముఖ్యంగా అమెరికాలో ఏర్పడబోయే, ఈ ఆర్థిక సంక్షోభం కారణంగా  పెట్టుబడిదారులంతా స్టాక్ మార్కెట్ నుంచి  తమ పెట్టుబడులను బంగారం వైపు తరలించే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.  ఎందుకంటే బంగారం అనేది చాలా సురక్షితమైన పెట్టుబడి సాధనం.  అందుకే స్టాక్ మార్కెట్ నుంచి పెట్టుబడులు బంగారం వైపు తలలే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో బంగారం ధరలు ఫ్యూచర్స్ మార్కెట్ తో మొదలై స్పాట్ మార్కెట్ వరకు భారీగా పెరిగే అవకాశం ఉంది.

ప్రస్తుతం భారతదేశంలో  10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 60 వేల రూపాయలు ఉంది.  అయితే గత వారం రోజులుగా బంగారం ధర కొద్దిగా తగ్గుముఖం పట్టింది. కానీ ప్రస్తుతం వస్తున్నటువంటి పిడుగు లాంటి వార్త బంగారం ధరలకు రెక్కలు తేవడం ఖాయం అని  నిపుణులు అంచనా వేస్తున్నారు.  అతి త్వరలోనే బంగారం ధర 75,000 దాటడం ఖాయమని, ఈ సంవత్సరం చివరి నాటికి ఒక లక్ష రూపాయలు దాటిన ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదని నిపుణులు అంచనా వేస్తున్నారు. 

ఇక అమెరికాలో ఆర్థిక సంక్షోభం విషయానికి వస్తే, ఇప్పటికే ఆ దేశంలో అధికారంలో ఉన్న డెమోక్రాట్లు,  రిపబ్లికన్ల మధ్య నెలకొన్నటువంటి సందిగ్ధం వల్ల సంక్షోభం దిశగా అమెరికా ఆర్థిక వ్యవస్థ  అడుగులు వేస్తోంది.  ముఖ్యంగా రుణ పరిమితిని పెంచడం పైన ఇరు  వర్గాల మధ్య దోబూచులాట మొదలైంది.  ప్రస్తుతం అమెరికన్ కాంగ్రెస్ దిగువ సభలో రిపబ్లికన్లదే  పై చేయి.  మరోవైపు సెనేట్లో మాత్రం  డెమోక్రట్ లది ఫై చేయగా ఉంది.  అయితే రుణ పరిమితి పెంపు పై ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు జోబిడన్, అమెరికన్ కాంగ్రెస్ దిగువసభ స్పీకర్ కెవిన్ మెకార్తి మధ్య చర్చలు విజయవంతం కాలేదు. అప్పు తీసుకోవడానికి దిగువ సభలో మెజారిటీ ఉన్న రిపబ్లికన్లు ఒప్పుకోవడం లేదు. దీంతో అమెరికన్ ప్రభుత్వం రుణాలు తీసుకునేందుకు కాంగ్రెస్ అనుమతి లభించకపోతే జూన్ ఒకటో తేదీ నుంచి జీతభత్యాలకు కూడా కటకటలాడే పరిస్థితి ఏర్పడుతుంది అలాగే పెన్షన్లకు కూడా డబ్బు నిధులు సరిపోవు దీంతోపాటు అమెరికన్ ప్రభుత్వం జారీ చేసే బాండ్లకు సైతం చెల్లింపులు జరపలేరు ఫలితంగా యావత్ ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉంది. 
 

బంగారంపై అమెరికా ఆర్థిక సంక్షోభం ప్రభావం. 
 అమెరికా ఆర్థిక సంక్షోభం ఫలితంగా అమెరికన్ ప్రభుత్వం జారీ చేసే బాండ్ల విలువ తగ్గిపోయే అవకాశం ఉంది ఫలితంగా పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం వైపే తరలి వెళ్లే అవకాశం పుష్కలంగా ఉంది దీంతో ప్రపంచవ్యాప్తంగా బంగారానికి ఒక్కసారిగా డిమాండ్ ఏర్పడుతుంది ఆ ఫలితంగా మన దేశం మార్కెట్లో సైతం పసిడి ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. 
 

Latest Videos

click me!