EPFO: పీఎఫ్ అకౌంట్ ఉన్న వారి జీవితం సెట్‌.. వెయ్యి రూపాయ‌లున్న పెన్ష‌న్ ఏకంగా రూ. 7500 కానుంది

Published : May 01, 2026, 08:23 AM IST

EPFO: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థకు చెందిన సభ్యులకు త్వరలో కీలక మార్పులు వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయి. మినిమం పెన్షన్ పెంపు నుంచి ఏటీఎమ్‌ ద్వారా డబ్బులు తీసుకునే సౌకర్యం వరకు పలు నిర్ణయాలు పరిశీలనలో ఉన్నాయి. 

PREV
15
మినిమం పెన్షన్ 7.5 రెట్లు పెరిగే అవ‌కాశం

ప్రస్తుతం ఎంప్లాయిస్ పెన్ష‌న్ స్కీమ్ (EPS-95) కింద కనిష్ట పెన్షన్ రూ.1,000 మాత్రమే ఉంది. అయితే దీనిని రూ.7,500 వరకు పెంచే ప్రతిపాదనపై ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఈ పెంపు కోసం కార్మిక సంఘాలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నాయి. పార్లమెంటరీ కమిటీ కూడా పెన్షన్ పెంచాలని సూచించింది. దీనిపై త్వరలో తుది నిర్ణయం వచ్చే అవకాశం ఉంది.

25
8.25% వడ్డీ రేటు – ఖాతాదారులకు గుడ్ న్యూస్

EPF ఖాతాదారులకు 8.25% వడ్డీ రేటు ఇవ్వాలని ప్రతిపాదన ఉంది. ప్రస్తుతం ఈ నిర్ణయం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అనుమతి కోసం ఎదురుచూస్తోంది. ఆమోదం వచ్చిన వెంటనే వడ్డీ మొత్తాన్ని సభ్యుల ఖాతాల్లో జమ చేస్తారు.

35
ATM ద్వారా PF డబ్బులు తీసుకునే సౌకర్యం

ఇప్పటివరకు PF డబ్బులు తీసుకోవాలంటే ఆన్‌లైన్ క్లెయిమ్ లేదా ప్రాసెస్ అవసరం. కానీ ఇకపై ATM ద్వారా కూడా డబ్బులు డ్రా చేసుకునే విధానాన్ని EPFO తీసుకురావాలని చూస్తోంది. ఇది అమల్లోకి వస్తే సభ్యులకు డబ్బులు పొందడం మరింత వేగంగా, సులభంగా మారుతుంది.

45
క్లెయిమ్ సెటిల్‌మెంట్‌లో EPFO కొత్త రికార్డ్

2025–26 ఆర్థిక సంవత్సరంలో EPFO మొత్తం 8.31 కోట్ల క్లెయిమ్‌లు సెటిల్ చేసింది. గత ఏడాది ఇది 6.01 కోట్లే జ‌రిగాయి. ఇందులో 5.51 కోట్ల క్లెయిమ్‌లు అడ్వాన్స్ లేదా పార్ట్ విత్‌డ్రాయల్స్‌కు సంబంధించినవి. ఆటోమేషన్ వల్ల ప్రాసెస్ వేగం పెరిగింది. 71.11% క్లెయిమ్‌లు మూడు రోజుల్లోనే క్లియర్ అయ్యాయి. గత ఏడాది ఇది 59.19% మాత్రమే కావ‌డం గ‌మ‌నార్హం.

55
డిజిటల్ సర్వీసులు

EPFO డిజిటల్ సేవలను విస్తరించింది. 6.68 కోట్ల క్లెయిమ్‌లు చెక్ ఇమేజ్ లేకుండా ప్రాసెస్ అయ్యాయి. 1.59 కోట్ల ఖాతాలు నేరుగా బ్యాంక్‌లతో లింక్ అయ్యాయి. రూ. 70.55 లక్షల ట్రాన్స్‌ఫర్ క్లెయిమ్‌లు ఆటో ప్రాసెస్ అయ్యాయి. ఇకపోతే E-PRAAPTI అనే కొత్త పోర్టల్‌ను కూడా ప్రారంభించింది. దీని ద్వారా పాత PF ఖాతాలను ఆధార్ ద్వారా సులభంగా యాక్టివేట్ చేసుకోవచ్చు. భవిష్యత్తులో UAN లేకపోయినా ఈ సేవలను విస్తరించే అవకాశముంది. మొత్తంగా చూస్తే, EPFOలో పెన్షన్ పెంపు, ATM విత్‌డ్రాయల్, వేగవంతమైన క్లెయిమ్ ప్రాసెసింగ్ వంటి మార్పులు సభ్యులకు పెద్ద ఉపశమనం ఇవ్వనున్నాయి. త్వరలో అధికారిక ప్రకటనలు వచ్చే అవకాశం ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories