స్థిరంగా బంగారం.. తగ్గిన వెండి ధరలు.. మీ నగరంలో 24క్యారెట్ల పసిడి ధర ఎంతంటే ?

First Published Nov 23, 2021, 11:10 AM IST

సోమవారం ట్రేడింగ్ ధర నుంచి నేడు ఉదయం వరకు బంగారం(gold), వెండి (silver)ధరలో ఎలాంటి మార్పు లేదు. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర (gold price)రూ.49,280గా ఉంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,280. మంగళవారం వెండి కిలో 65,600 రూపాయల వద్ద ట్రేడవుతోంది.
 

Image: Gold ornaments on the occasion of 'Dhanteras' festival at a shop in New Delhi. Photograph: K AsifIndia Today GroupGetty Images

అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ సోమవారం ఫెడ్ చైర్ పావెల్‌ను రెండవ ఫోర్ ఇయర్ టర్మ్ కి నామినేట్ చేసిన తర్వాత డాలర్ ఇండెక్స్ 16 నెలల గరిష్ట స్థాయికి చేరుకుంది. ఎం‌సి‌ఎక్స్ లో గోల్డ్  ఫ్యూచర్లు 0.07 శాతం లేదా రూ. 35 పెరిగి 10 గ్రాములకు రూ.47,958 వద్ద ఉన్నాయి. సిల్వర్ ఫ్యూచర్స్ కిలోకు 0.15 శాతం లేదా రూ.97 పెరిగి రూ.64,668కి చేరుకుంది.

యూ‌ఎస్ 10-సంవత్సరాల ట్రెజరీ ఈల్డ్‌లు గత వారంలో 1.56 శాతం నుండి 1.62 శాతానికి పెరిగాయి. జెరోమ్ పావెల్‌ను ఫెడ్ ఛైర్మన్‌గా రెండోసారి నామినేట్ చేసిన తర్వాత కూడా బంగారం ధరలు తగ్గాయి'' అని హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ (కమోడిటీస్) తపన్ పటేల్ తెలిపారు.

ఇండియన్ బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ ప్రకారం సోమవారం స్పాట్ మార్కెట్‌లో అత్యధిక స్వచ్ఛత బంగారం ధర రూ.48,834గా ఉండగా, వెండి ధర రూ.65,829గా ఉంది.

గ్లోబల్ మార్కెట్లలో
స్పాట్ బంగారం 00:48 GMT నాటికి ఔన్స్‌కు 0.2 శాతం పెరిగి 1,809.40 డాలర్లకి చేరుకుంది, నవంబర్ 5 నుండి సోమవారం నాటి కనిష్ట స్థాయికి 2.1 శాతం పడిపోయింది. యూ‌ఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.2 శాతం పెరిగి 1,809.60 డాలర్లకి చేరుకుంది.

ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,240గా ఉండగా, ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,280గా ఉంది. ఢిల్లీలో  10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ.47,890గా ఉండగా  ముంబైలలో 22 క్యారెట్ల బంగారం ధర  రూ.48,280గా ఉంది.

మంగళవారం చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,410గా ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.46,210గా ఉంది. 

కోల్‌కతాలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,990గా ఉండగా, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,290గా ఉంది.

బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,900గా ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,740గా ఉంది. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.49,900గా ఉండగా,  22 క్యారెట్ల 10 గ్రాముల  బంగారం ధర రూ.45,740గా ఉంది.

ఎక్సైజ్ సుంకం, రాష్ట్ర పన్నులు మేకింగ్ ఛార్జీల కారణంగా బంగారం ధర దేశవ్యాప్తంగా మారుతూ ఉంటుంది.

మంగళవారం చెన్నైలో కిలో వెండి ధర రూ.70,400గా ఉండగా, ఢిల్లీ ఇంకా ముంబైలో  రూ.65,600గా విక్రయిస్తున్నారు.

కోల్‌కతా, బెంగళూరులలో కిలో వెండి రూ.65,600 వద్ద ట్రేడవుతుండగా, హైదరాబాద్‌లో రూ.70,400గా విక్రయిస్తోంది.

click me!