జి‌ఎస్‌టి బాదుడు.. మరింత ఖరీదైనవిగా రెడీమేడ్ డ్రెసెస్, ఫూట్ వేర్.. ఎప్పటినుంచి అంటే ?

First Published Nov 22, 2021, 6:33 PM IST

వచ్చే ఏడాది అంటే జనవరి 2022 నుండి రెడీమేడ్ గార్మెంట్స్, టెక్స్‌టైల్స్, పాదరక్షల కొనుగోలు ఖరీదైనదిగా మారనున్నాయి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్ డైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ (CBIC) విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం, ఈ ఉత్పత్తులపై జి‌ఎస్‌టి (GST) ధరలను పెంచారు.

దీనికి సంబంధించి విడుదల చేసిన నివేదిక ప్రకారం రెడీమేడ్‌ గార్మెంట్స్‌, టెక్స్‌టైల్స్‌, ఫుట్‌వేర్‌ వంటి ఉత్పత్తులపై జీఎస్టీ రేట్లను 5 శాతం నుంచి 12 శాతానికి ప్రభుత్వం పెంచింది. ఈ పెరిగిన రేట్లు జనవరి 2022 నుండి వర్తిస్తాయి. జనవరి 2022 నుండి ఫ్యాబ్రిక్స్‌పై జిఎస్‌టి రేట్లు 5 శాతం నుండి 12 శాతం వరకు అదేవిధంగా, ఏదైనా విలువగల రెడీమేడ్ దుస్తులపై కూడా జీఎస్టీ రేటు 12 శాతంగా ఉంటుంది. గతంలో రూ.1000 కంటే ఎక్కువ విలువైన బట్టలపై 5 శాతం జీఎస్టీ విధించడం గమనార్హం.
 

ఇతర వస్త్రాలపై (నేసిన బట్టలు, సింథటిక్ నూలులు, పైల్ ఫ్యాబ్రిక్స్, బ్లాంకెట్లు, టెంట్లు, టేబుల్ క్లాత్‌లు వంటి ఇతర వస్త్రాలు)పై కూడా జీఎస్టీ రేటును 5 శాతం నుంచి 12 శాతానికి పెంచారు. అదనంగా ఏదైనా విలువగల పాదరక్షలపై వర్తించే జి‌ఎస్‌టి రేటు కూడా 12 శాతానికి పెంచింది. దీనిపై నవంబర్ 19న భారత దుస్తుల తయారీదారుల సంఘం (సీఎంఏఐ) వ్యాఖ్యానిస్తూ  దుస్తులపై జీఎస్టీని పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా నిరాశాజనకంగా ఉందన్నారు.
 

ముడిసరుకు ధరలు ముఖ్యంగా నూలు, ప్యాకింగ్ మెటీరియల్, సరకు రవాణా పెరగడంతో పరిశ్రమ ద్రవ్యోల్బణ ఒత్తిడిని ఎదుర్కొంటున్నందున ధరల పెంపు తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని పరిశ్రమ సంఘం పేర్కొంది.

click me!