బంగారం కొనేవారికి గుడ్ న్యూస్.. దిగోస్తున్న పసిడి, వెండి ధరలు..

Ashok Kumar   | Asianet News
Published : Aug 12, 2021, 11:42 AM ISTUpdated : Aug 12, 2021, 11:49 AM IST

 దేశీయ మార్కెట్‌లో నేడు గోల్డ్ ఫ్యూచర్స్ ధర తగ్గింది. పసుపు లోహం  స్పాట్ ధర ఆగస్టులో ఇప్పటివరకు రూ .2,100 పైగా దిగోచ్చింది. అదేవిధంగా, ప్రస్తుత నెలలో వెండి ధర రూ. 5,200 పైగా తగ్గింది. 

PREV
16
బంగారం కొనేవారికి గుడ్ న్యూస్.. దిగోస్తున్న పసిడి, వెండి ధరలు..

ఎం‌సి‌ఎక్స్ లో గోల్డ్ ఫ్యూచర్స్ 0.14 శాతం (రూ. 67) తగ్గి 10 గ్రాములకు రూ. 46,321 కి చేరుకుంది. వెండి గురించి మాట్లాడితే  0.34 శాతం అంటే రూ. 216 క్షీణించింది కిలోకు రూ. 62555 వద్ద ఉంది. గత మూడు రోజుల్లో వెండి ధర 1.5 శాతానికి పైగా తగ్గింది. బంగారం ధర గత ఏడాది గరిష్ట స్థాయి (10 గ్రాములకు రూ. 56,200) నుండి రూ .9879 తగ్గింది.  

26

భారతదేశంలో భౌతిక బంగారం డిమాండ్ బలహీనంగా ఉంది. ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ ప్రకారం, అత్యధిక స్వచ్ఛత కలిగిన బంగారం 10 గ్రాములకు రూ.46328లకు విక్రయించబడింది, బుధవారం వెండి స్పాట్ మార్కెట్లో కిలోకు రూ.62850లకు విక్రయించబడింది. డెల్టా వేరియంట్ వ్యాప్తి గురించి పెరుగుతున్న ఆందోళనల మధ్య వ్యాపారులు, పెట్టుబడిదారులు జాగ్రత్తగా వహిస్తున్నారు. అసమాన ప్రపంచ ఆర్థిక పునరుద్ధరణ, డాలర్‌తో రూపాయి మారకం అస్థిరత విలువైన లోహం ధరను ప్రభావితం చేస్తాయి. 

36

నేడు గ్లోబల్ మార్కెట్లలో స్పాట్ బంగారం ధర ఔన్సుకి 1,750.34 డాలర్లకు పెరిగింది. యుఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్‌కు  1,753.10  డాలర్ల వద్ద ఫ్లాట్ అయ్యాయి. ఇతర విలువైన లోహాలలో వెండి 0.2 శాతం తగ్గి ఔన్సు  23.47 డాలర్ల వద్ద ఉంది. పల్లాడియం 0.1 శాతం పెరిగి 2,638.14 డాలర్ల వద్ద, ప్లాటినం 1,017.91 డాలర్ల వద్ద ఫ్లాట్ అయింది. 
 

46

గురువారం బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయని హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్ సీనియర్ ఎనలిస్ట్ (కమోడిటీస్) తపన్ పటేల్ తెలిపారు.  

56

చెన్నైలో బంగారం ధర 22 క్యారెట్ల 10 గ్రాములకు రూ. 43,720.
ముంబైలో బంగారం ధర 22 క్యారెట్ల 10 గ్రాములకు రూ. 45,280.
ఢిల్లీలో బంగారం ధర 22 క్యారెట్ల 10 గ్రాములకు రూ. 45,500.
కోల్‌కతాలో బంగారం ధర 22 క్యారెట్ల 10 గ్రాములకు రూ. 45,700.
బెంగళూరులో బంగారం ధర 22 క్యారెట్ల 10 గ్రాములకు రూ. 43,350.
హైదరాబాద్‌లో బంగారం ధర 22 క్యారెట్ల 10 గ్రాములకు రూ. 43,350.

66

కేరళలో బంగారం ధర 22 క్యారెట్ల 10 గ్రాములకు రూ. 43,350.
పూణేలో బంగారం ధర 22 క్యారెట్ల 10 గ్రాములకు రూ. 44,440.
జైపూర్‌లో బంగారం ధర 22 క్యారెట్ల 10 గ్రాములకు రూ. 45,300.
ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో బంగారం రేటు 22 క్యారెట్ల 10 గ్రాములకు రూ. 45,500.
పాట్నాలో బంగారం ధర 22 క్యారెట్ల 10 గ్రాములకు రూ. 44,440.
పాట్నాలో బంగారం ధర 22 క్యారెట్ల 10 గ్రాములకు రూ. 44,440.
నాగ్‌పూర్‌లో బంగారం ధర 22 క్యారెట్ల 10 గ్రాములకు రూ. 45,280.
 

click me!

Recommended Stories