దిగోస్తున్న బంగారం వెండి ధరలు: మూడు రోజుల్లో పసిడి ధర ఎంత పెరిగిందంటే..?

First Published Sep 17, 2021, 2:53 PM IST

నేడు దేశీయ మార్కెట్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ ధర మళ్లీ తగ్గింది. కానీ వెండి ఫ్యూచర్స్ ధర పెరుగుదల నమోదు చేసింది. దీంతో పసిడి ఐదు నెలల కనిష్టానికి చేరుకుంది. మల్టీ కామోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎం‌సి‌ఎక్స్)లో బంగారం ధర స్వల్పంగా 10 గ్రాములకు రూ. 46050కి పడిపోయింది. వెండి 0.26 శాతం లాభపడి కిలోకు రూ. 61,233 వద్ద ఉంది.

 గత ఏడాది బంగారం ధర  గరిష్ట స్థాయి 10 గ్రాములకు రూ. 56,200 నుండి  రూ .10,150 తగ్గింది. నిన్న  బంగారం ధర 1.7 శాతం లేదా రూ .807 తగ్గిపోయింది, వెండి 3.5 శాతం లేదా రూ .2,150 తగ్గింది. గత మూడు రోజుల్లో బంగారం రూ .1200 తగ్గింది. 

గ్లోబల్ మార్కెట్‌లో ధర

గ్లోబల్ మార్కెట్లలో నిన్న భారీగా పతనం తర్వాత స్పాట్ బంగారం ధర ఔన్స్‌కు 1,754.86 డాలర్లుగా ఉంది. వచ్చే వారం జరిగనున్న ఫెడరల్ రిజర్వ్ సమావేశానికి ముందు ఇన్వెస్టర్లు జాగ్రత్తగా వహిస్తున్నారు. ఇతర విలువైన లోహాలలో వెండి గురువారం ఒక నెల కనిష్టాన్ని తాకిన తర్వాత ఔన్స్ కి 22.93 డాలర్ల వద్ద ఫ్లాట్ అయింది, ప్లాటినం 0.6 శాతం పెరిగి 938.88 డాలర్లకు చేరుకుంది.

ఫెడ్  ఓపెన్ మార్కెట్ కమిటీ సమావేశం సెప్టెంబర్ 21న ప్రారంభం కానుంది,

యూ‌ఎస్ రిటైల్ విక్రయాల డేటా తర్వాత  కరెన్సీలతో పోలిస్తే డాలర్ ఇండెక్స్ మూడు వారాల గరిష్టానికి పెరిగింది. ఇది మూడవ త్రైమాసికంలో ఆర్థిక వృద్ధిలో తీవ్ర మందగమనం అంచనాలను తగ్గించింది. ఫెడ్  ఓపెన్ మార్కెట్ కమిటీ   సమావేశం సెప్టెంబర్ 21న ప్రారంభమవుతుంది. ఆగస్టులో బంగారం దిగుమతులు అధికంగా ఉన్నప్పటికీ భారతదేశంలో భౌతిక బంగారం డిమాండ్ బలహీనంగా ఉంది. దేశీయ డీలర్లు రాబోయే పండుగ సీజన్‌లో ఎక్కువ అమ్మకాలను భావిస్తున్నారు.

బంగారం ఆభరణాల విక్రయదారులకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆదాయం 12–14 శాతం అధికంగా ఉంటుందని రేటింగ్‌ ఏజెన్సీ క్రిసిల్‌ అంచనా వేసింది. బంగారం ధరలు స్థిరంగా ఉండడానికితోడు వివాహాలు, పండుగల కోసం ఆభరణాలపై ఖర్చు చేయడం ఇందుకు మద్దతుగా నిలుస్తాయని పేర్కొంది.


హైదరాబాద్ మార్కెట్‌లో శుక్రవారం బంగారం ధర పడిపోయింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.330 తగ్గి రూ.48,000కు క్షీణించింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ.300 క్షీణతతో రూ.44000కు తగ్గింది.

వెండి ధర  రూ.100 పైకి కదిలి కేజీ వెండి ధర రూ.67,800కు ఎగసింది. వెండి కొనుగోలు చేయాలని భావించే వారికి బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. కాగా బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు, బాండ్ ఈల్డ్ వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయని గమనించాలి.

click me!