పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గనున్నయా..? ఇండియాలో లీటరుకి అసలు ధర ఎంతంటే..?

First Published Sep 17, 2021, 1:27 PM IST

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ప్రజాలకు చుక్కలు చూపిస్తున్నాయి. ఒకవైపు సాధారణ ప్రజలు మరోవైపు ప్రతిపక్షాలు ఇంధన ధరల పెంపును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అధిక పన్నుల కారణంగా దేశంలో చమురు ధర భారీగా ఉందని ప్రజలు అంటున్నారు. 

దీనిని దృష్టిలో ఉంచుకుని నేడు జరిగే వస్తు సేవల పన్ను (GST) కౌన్సిల్ 45వ సమావేశంలో పెట్రోల్, డీజిల్‌ను జి‌ఎస్‌టి పరిధిలోకి తీసుకురావాలనే సూచనపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చర్చించనున్నారు.
 

పెట్రోల్-డీజిల్ చాలా చౌకగా ఉండవచ్చు

 పెట్రోల్ పై జి‌ఎస్‌టి  తగ్గితే సుమారు రూ .28, డీజిల్ రూ .25 తగ్గొచని  ఊహిస్తున్నారు. ప్రస్తుతం దేశంలోని చాలా నగరాల్లో పెట్రోల్ ధర  రూ.110, డీజిల్ ధర లీటరుకు రూ .100 దాటింది. 


2017 జూలై 1న జి‌ఎస్‌టి అమలు చేయబడినప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకుని ముడి చమురు, సహజ వాయువు, పెట్రోల్, డీజిల్, ఏ‌టి‌ఎఫ్ లను జి‌ఎస్‌టి పరిధికి దూరంగా ఉంచిన విషయం తెలిసిందే. దీనిపై కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు తమ ప్రదేశాలలో వేర్వేరు పన్నులను విధిస్తాయి, దాని నుండి వచ్చే డబ్బు ప్రభుత్వ ఖజానాకు వెళుతుంది.
 

పెట్రోల్, డీజిల్‌పై పన్ను ఎంత?

నేడు ఢిల్లీలో పెట్రోల్ ధర రూ. 101.19, డీజిల్ ధర రూ. 88.62. ఈ డబ్బులో సగానికి పైగా కంపెనీలకే కాదు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వానికి పన్ను రూపంలో వెళ్తుంది. 

సెప్టెంబర్ 17 నాటికి ఢిల్లీలో పెట్రోల్ ధర
 
బేస్ ప్రైస్/ఎక్స్ ఫ్యాక్టరీ ధర    రూ. 40.78
సరుకు                                    రూ. 0.32
ఎక్సైజ్ డ్యూటీ                        రూ .32.90
డీలర్ కమీషన్                        రూ. 3.84
వ్యాట్ (డీలర్ కమీషన్‌తో)        రూ .23.35
అన్నీ కలిపి మార్కెట్ ధర       రూ. 101.19

సెప్టెంబర్ 17 నాటికి ఢిల్లీలో డీజిల్ ధర
 
బేస్ ప్రైస్/ఎక్స్ ఫ్యాక్టరీ ధర    రూ. 40.97
సరుకు                                    రూ. 0.30
ఎక్సైజ్ డ్యూటీ                         రూ. 31.80
డీలర్ కమీషన్                         రూ 2.59
వ్యాట్ (డీలర్ కమీషన్‌తో)        రూ 12.96
అన్నీ కలిపి మార్కెట్ ధర       రూ. 88.62

click me!