ప్రభుత్వం చర్యలు ఫలితంగా ఊపందుకున్న ఎఫ్‌డిఐ ప్రవాహాలు.. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 62% ఎక్కువ..

First Published Sep 22, 2021, 5:32 PM IST

ఎఫ్‌డిఐ పాలసీ సంస్కరణలు, పెట్టుబడుల సదుపాయం, సులభతరమైన వ్యాపారం వంటి అంశాలపై ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఫలితంగా దేశంలోకి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ (ఎఫ్‌డిఐ) ప్రవాహాలు పెరిగాయి. 

భారతదేశ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులలో  ఈ క్రింది విధగా  ప్రపంచ పెట్టుబడిదారులు ఇష్టపడే పెట్టుబడి గమ్యస్థానంగా నిలిచింది.

2021-22 ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగు నెలల్లో భారతదేశం మొత్తం 27.37 బిలియన్ డాలర్ల ఎఫ్‌డిఐ ప్రవాహాన్ని ఆకర్షించింది, గత 2020-21 ఆర్థిక సంవత్సర (యూ‌ఎస్ 16.92 బిలియన్ డాలర్లు) కాలంతో పోలిస్తే 62% ఎక్కువ.

గత సంవత్సరం కాలంతో పోలిస్తే (యూ‌ఎస్ 9.61 బిలియన్ డాలర్లు) ఎఫ్‌డిఐ ఈక్విటీ ఇన్‌ఫ్లో ఎఫ్‌వై 2021-22 మొదటి నాలుగు నెలల్లో 112% పెరిగింది (యూ‌ఎస్ 20.42 బిలియన్ డాలర్లు). 

2021-22 ఆర్థిక సంవత్సరంలో  మొత్తం ఎఫ్‌డిఐ ఈక్విటీ ఇన్‌ఫ్లో 23% వాటాతో   మొదటి నాలుగు నెలల్లో 'ఆటోమొబైల్ ఇండస్ట్రీ' టాప్ సెక్టార్‌గా అవతరించింది, తరువాత కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ & హార్డ్‌వేర్ (18%) అండ్ సర్వీసెస్ సెక్టార్ (10%) వరుసగా ఉన్నాయి.
 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22) మొదటి నాలుగు నెలల్లో కర్ణాటక రాష్ట్రంలో మెజారిటీ ఎఫ్‌డిఐ ఈక్విటీ ఇన్‌ఫ్లో (87%) నమోదు చేసింది.

మొత్తం ఎఫ్‌డిఐ ఈక్విటీ ప్రవాహంలో 45% వాటాతో 2021-22 ఆర్థిక సంవత్సరంలో (జూలై 2021 వరకు) కర్ణాటక అగ్రగామి రాష్ట్రంగా ఉంది,  తరువాత మహారాష్ట్ర (23%), ఢిల్లీ (12%) ఉన్నాయి.

click me!