"గత కొన్ని నెలలుగా మీరు చాలా అద్భుతంగా, ఫన్నీగా ఉన్నారు. మీ జీవితంలో ఏం మారింది? మీ రహస్యం ఏమిటి?" ఒకరు అడగగా దానికి అతను "మేము నిర్మిస్తున్న కొన్ని అద్భుతమైన విషయాలపై నేను మరింత దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నాను అలాగే నా కుటుంబం, స్నేహితులతో ఇంకా ఆహ్లాదకరమైన పనులు చేయలనుకుంటున్న." అంటూ రిప్లయి ఇచ్చాడు.
అయితే ఈ కథనంపై మార్క్ జుకర్‌బర్గ్ స్పందన చూసి రచయిత ర్యాన్ మాక్ ఆశ్చర్యపోయారు. ఫేస్‌బుక్ ప్లాట్‌ఫారమ్‌పై తప్పుడు సమాచారాల మధ్య ఫేస్‌బుక్ సమస్యలను సరిగా పరిష్కరించడంలో విఫలమైందని, లాభాలకు ప్రాధాన్యతనిస్తుందని వాల్ స్ట్రీట్ జర్నల్ గత వారం నివేదికలను ప్రచురించింది.