బంగారం, ఆభరణాలు కొనేవారికి గుడ్ న్యూస్.. నేడు హైదరాబాద్‌లో పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

Ashok Kumar   | Asianet News
Published : Sep 07, 2021, 11:36 AM IST

నేడు మంగళవారం దేశీయ మార్కెట్‌లో వరుసగా రెండో రోజు గోల్డ్ ఫ్యూచర్స్ ధర తగ్గగా, వెండి ధర కూడా తగ్గింది. ఎం‌సి‌ఎక్స్ లో గోల్డ్ ఫ్యూచర్స్ 0.04 శాతం తగ్గి 10 గ్రాములకు రూ. 47,406 కి చేరుకుంది. వెండి గురించి మాట్లాడితే  కేజీకి 0.13 శాతం తగ్గి రూ. 65,208 కి చేరింది. 

PREV
14
బంగారం, ఆభరణాలు కొనేవారికి గుడ్ న్యూస్.. నేడు హైదరాబాద్‌లో పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

 గత సెషన్‌లో బంగారం ధర 0.17 శాతం తగ్గిపోయింది, వెండి 0.19 శాతం పెరిగింది. గత సంవత్సరం గరిష్ట స్థాయి 10 గ్రాములకు రూ. 56,200 నుండి పసిసి ఇప్పటి వరకు రూ .8794 తగ్గింది.  గ్లోబల్ మార్కెట్లో ఈ రోజు  బంగారం ధర 0.2 శాతం పెరిగి ఔన్స్ 1,826.75 డాలర్లకు చేరుకుంది. ఇతర విలువైన లోహాలలో వెండి 0.4 శాతం పెరిగి ఔన్స్ కి 24.76 డాలర్లు, ప్లాటినం  1,020.26  డాలర్ల వద్ద ఉంది.  

భారతదేశంలో బంగారం ధరలో 10.75 శాతం దిగుమతి సుంకం, మూడు శాతం జిఎస్‌టి ఉంటుంది. కరోనా వైరస్ డెల్టా వేరియంట్ వ్యాప్తి గురించి పెరుగుతున్న ఆందోళనల మధ్య వ్యాపారులు, పెట్టుబడిదారులు జాగ్రత్త వహిస్తున్నారు. 
 

24
ఆభరణాల ఎగుమతులు ఏప్రిల్-జూలైలో 12.5 బిలియన్ల డాలర్లకు పెరిగాయి

ఏప్రిల్-జూలై 2021లో రత్నాలు, ఆభరణాల ఎగుమతులు 6.04 శాతం పెరిగి 1.55 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. 2019-20 కాలంలో ఈ సంఖ్య  11.8 బిలియన్ల డాలర్లుగా ఉన్నాయి. యు.ఎస్, చైనా, హాంకాంగ్ వంటి ప్రధాన ఎగుమతి గమ్యస్థాన మార్కెట్లలో కొనసాగుతున్న పునరుద్ధరణ ఎగుమతులను పెంచింది. జూలైలో దేశ ఎగుమతులు 18 శాతం పెరిగి 3.36 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని జిజెఇపిసి నివేదించింది. గత ఏడాది ఇదే కాలంలో 3.87 బిలియన్ డాలర్లుగా ఉంది. బంగారు ఆభరణాల ఎగుమతులు 38.5 శాతం తగ్గి 2.41 బిలియన్ డాలర్లకు చేరాయి. వెండి ఆభరణాల ఎగుమతులు 843 మిలియన్ల డాలర్లకు పెరిగాయి.

34

తాజా సమాచారం ప్రకారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ. 44,510కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ. 48,560 కి చేరింది. 

దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు..
* దేశ రాజధాని న్యూఢిల్లీలో కిలో వెండి ధర రూ. 65,300 లుగా ఉంది.
* దేశ ఆర్థిక రాజధాని ముంబైలో వెండి ధర రూ. 65,300 వద్ద కొనసాగుతోంది.
 * కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.65,300 లుగా ఉంది.
* హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.69,800 లుగా కొనసాగుతోంది.

44
gold

కాగా బంగారం ధర  ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు, బాండ్ ఈల్డ్ వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.

click me!

Recommended Stories