దిగోస్తున్న బంగారం ధరలు.. స్థిరంగా వెండి.. హైదరాబాద్‌లో పసిడి ఎంతంటే..!

Ashok Kumar   | Asianet News
Published : Sep 06, 2021, 11:09 AM IST

 సోమవారం దేశీయ మార్కెట్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ ధర తగ్గింది, మరో వైపు వెండి ధర స్థిరంగా ఉంది. ఎం‌సి‌ఎక్స్ లో గోల్డ్ ఫ్యూచర్స్ 0.15 శాతం తగ్గి 10 గ్రాములకు రూ. 47,451 కి చేరుకుంది. గత సెషన్‌లో ఒక నెల గరిష్టాన్ని తాకింది. వెండి గురించి మాట్లాడితే కిలోకు ధర రూ. 65,261 వద్ద ఫ్లాట్ గా ఉంది. 

PREV
16
దిగోస్తున్న బంగారం ధరలు.. స్థిరంగా వెండి.. హైదరాబాద్‌లో పసిడి ఎంతంటే..!

గత సెషన్‌లో బంగారం ధర రూ .500 పెరిగింది, వెండి ధర రూ .1900 పెరిగింది. గత ఏడాది పసిడి గరిష్ట స్థాయి 10 గ్రాములకు రూ. 56,200 నుండి ఇప్పటికీ రూ .8749 తగ్గింది.  భారతదేశంలో బంగారం ధరలో 10.75 శాతం దిగుమతి సుంకం, మూడు శాతం జిఎస్‌టి ఉంటుంది. ద్రవ్యోల్బణం, కరెన్సీ తరుగుదలపై బంగారం హెడ్జ్‌గా పరిగణించబడుతుంది.  
 

26
ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో బంగారం డిమాండ్ పెరిగింది

వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (WGC) నివేదిక ప్రకారం ఈ సంవత్సరం ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో భారతదేశంలో బంగారం డిమాండ్ 19.2 శాతం పెరిగింది అలాగే  76.1 టన్నులకు చేరుకుంది. గత సంవత్సరం, కరోనా వ్యాప్తిని నియంత్రించడానికి విధించిన దేశవ్యాప్త లాక్ డౌన్ కారణంగా ఆర్థిక కార్యకలాపాలు బాగా దెబ్బతిన్నాయి. 2020 క్యాలెండర్ సంవత్సరం రెండవ త్రైమాసికంలో మొత్తం బంగారం డిమాండ్ 63.8 టన్నులు అని డబల్యూ‌జి‌సి నివేదిక '2021 రెండవ త్రైమాసికంలో పేర్కొంది. నివేదిక ప్రకారం భారతదేశంలో బంగారం డిమాండ్ విలువ 23 శాతం పెరిగి రూ .32,810 కోట్లకు చేరుకుంది. 2020 ఇదే కాలంలో రూ .26,600 కోట్లుగా ఉంది. 

36
గత ఏడాది బంగారం డిమాండ్ 35 శాతానికి పైగా తగ్గింది

 గత సంవత్సరం అంటే 2020లో దేశంలోని బంగారం డిమాండ్ 35 శాతం కంటే ఎక్కువ తగ్గి 446.4 టన్నులకు చేరుకుంది. ఈ సమాచారం వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (WGC) నివేదికలో తెలిపింది. 2020 గోల్డ్ డిమాండ్ వైఖరిపై డబ్ల్యుజిసి నివేదిక ప్రకారం కరోనావైరస్ లాక్ డౌన్ విలువైన లోహం పసిడి ధర ఆల్-టైమ్ గరిష్ట స్థాయిని తాకినప్పుడు బంగారం డిమాండ్ తగ్గింది. అయితే పరిస్థితి ఇప్పుడు సాధారణ స్థితికి చేరుకుంటుందని నివేదిక పేర్కొంది. ఇలాంటి పరిస్థితిలో ఈ సంవత్సరం 2021లో బంగారం డిమాండ్ మెరుగుపడుతుందని భావిస్తున్నారు. 

46
దేశంలో ప్రధాన నగరాల్లో ధరల వివరాలు:

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,660 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,910 ఉంది.

 చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,970 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,060 ఉంది.

ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,410 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,410 ఉంది.

కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,010 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,710 ఉంది.

బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,510 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,560 ఉంది.

కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,510 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,560 ఉంది.

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,560 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,610 ఉంది.
 

56
వెండి ధరలు:

దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.65,200 ఉండగా, ముంబైలో రూ.65,200గా ఉంది. అలాగే చెన్నైలో కిలో వెండి ధర రూ.69,600 ఉండగా, కోల్‌కతాలో రూ.65,200 ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.65,200 ఉండగా, హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.69,600 ఉంది. అయితే ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకుంటూనే ఉంటాయి. వినియోగదారులు కొనుగోలు చేసే సమయానికి ముందుగానే ధరలు తెలుసుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

66

అయితే బంగారం ధరల హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలున్నాయంటున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు వెల్లడిస్తున్నారు.

click me!

Recommended Stories