ప్రపంచవ్యాప్తంగా భారీ సంస్థలు, ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్స్, సెంట్రల్ బ్యాంకులు కూడా బంగారం కొనుగోళ్లను పెంచుతున్నాయి. డిమాండ్ ఒక్కసారిగా పెరగడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 4,050 డాలర్ల మార్కును దాటి 4,100 డాలర్ల దిశగా దూసుకెళ్తోంది.
హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ప్రస్తుతం రూ.1,46,510కు చేరుకుంది. నిన్నటితో పోలిస్తే రూ.2,290 పెరిగింది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర రూ.1,34,300గా ఉంది. దీనిపై కూడా రూ.2,100 పెరుగుదల నమోదైంది. వెండి విషయానికి వస్తే... కిలో వెండి ధర ఏకంగా రూ.5 వేల పెరిగి ప్రస్తుతం రూ.2,45,000కు చేరుకుంది.