బంగారం ధరల పరుగులు.. నేడు 10గ్రా పసిడి ధర ఎంత పెరిగిందంటే..?

First Published Nov 6, 2021, 11:13 AM IST

బంగారం కొనుగోలుదారులకు పసిడి ధరలు రోజురోజుకి షాకిస్తున్నాయి. దీపావలీ(diwali), ధంతెరాస్ సందర్భంగా ఎగిసిన బంగారం ధరలు (gold prices)నేడు కాస్త దిగోచ్చాయి. ఒకవైపు పెట్రోల్, డీజిల్ ధరలు దిగిరావడంతో ఈ రోజు పసిడి ప్రియులకు ఊరట లభించింది. నిన్న నిలకడగా ఉన్న బంగారం ధర ఈ రోజు అంటే శనివారం నవంబర్ 6న తగ్గుముఖం పట్టింది.

దేశీయంగా పరిశీలిస్తే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ప్రస్తుతం 46,220 ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర 47 వేల 220గా వద్ద కొనసాగుతోంది.  ఇంకో విషయం ఏంటంటే ఈ రోజు కొన్ని నగరాల్లో పసిడి ధరలు  తగ్గితే మరి కొన్ని నగరాల్లో పెరిగింది.  

బెంగళూరు, హైదరాబాద్‌, కేరళ, ఢిల్లీ నగరాల్లో 10 గ్రాముల బంగారం ధరపై పై రూ.190 నుంచి  రూ.250 వరకు పెరిగింది. ఇతర ప్రాంతాల్లో రూ.190 నుంచి రూ.250  వరకు తగ్గుముఖం పట్టింది. తాజాగా శనివారం దేశంలోని ప్రధాన నగరాల్లో నమోదైన ధరలు ఈ విధంగా ఉన్నాయి.
 

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,110గా ఉంది. 
ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,220 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,220గా ఉంది.
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,050 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,140 ఉంది. 
కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర  రూ.49,250గాఉంది.
 బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,760 ఉంది. 
కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,760గా ఉంది.
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,760గా ఉంది.  
 

అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలలో పెరుగుదల, డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ, ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్లలో మార్పు, వివిధ జువెలరీ మార్కెట్లలో డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి. అందుకే బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటాయి. 

ఒక వైపు బంగారం ధర కొన్ని ప్రాంతాల్లో స్వల్పంగా పెరిగి, మరి కొన్ని ప్రాంతాల్లో స్వల్పంగా తగ్గింది. అలాగే శనివారం వెండి ధర మాత్రం భారీగా పెరిగింది. ముఖ్యంగా వెండి కొనుగోళ్లు కూడా ప్రతి రోజు భారీగానే జరుగుతుంటాయి. దీపావళి సందర్భంగా  వెండి దీపాలు, వెండి విగ్రహాలు, వెండి పాత్రలు ఎక్కువగా  కొనుగోలు చేస్తుంటారు. 


 ఇండియన్ బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ ప్రకారం, మీరు 8955664433 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా  పసిడి ధరలను తనిఖీ చేయవచ్చు.  

click me!