వాహనదారులకు గుడ్ న్యూస్.. భారీగా దిగోచ్చిన ఇంధన ధరలు.. ఏ రాష్ట్రంలో ఎంత తగ్గిందంటే..?

First Published Nov 5, 2021, 11:22 AM IST

 కేంద్ర ప్రభుత్వం బుధవారం పెట్రోల్(petrol), డీజిల్‌(diesel)పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన వెంటనే సామాన్య ప్రజలపై పెరుగుతున్న భారాన్ని తగ్గించడానికి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఇంధన ధరల(fuel price)పై అదనపు తగ్గింపును ప్రకటించాయి. 

పెట్రోల్‌పై లీటరుకు  రూ.5 , డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని లీటర్‌కు  రూ.10 తగ్గిస్తున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ బుధవారం ప్రకటించింది. అయితే రికార్డు స్థాయికి చేరిన ఇంధన ధరల మధ్య గత మూడేళ్లలో సెంట్రల్ ఎక్సైజ్ సుంకాలను తగ్గించడం ఇదే తొలిసారి.

ఈ రాష్ట్రాలు, యూనియన్ టెరిటరిలు ఇంధన ధరలను తగ్గించాయి:

ఒడిషా
ఒడిశా ప్రభుత్వం గురువారం పెట్రోల్, డీజిల్‌పై వాల్యు ఆధారిత పన్ను (వ్యాట్)ని లీటరుకు రూ.3 తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. తగ్గిన ధరలు నవంబర్ 5 నుండి  అమలులోకి వస్తుంది.

అరుణాచల్ ప్రదేశ్
అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ గురువారం పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ ధరలను 5.5 శాతం తగ్గించినట్లు ప్రకటించారు. సవరించిన వ్యాట్ ధరలు నవంబర్ 5 అర్ధరాత్రి నుండి  వర్తిస్తాయి.

మధ్యప్రదేశ్
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గురువారం  వ్యాట్ లో నాలుగు శాతం తగ్గింపును,  ఇంధనాలపై సెస్‌లో   రూ.1.50 తగ్గింపును ప్రకటించారు. ఫలితంగా, రాష్ట్ర రాజధాని భోపాల్‌లో శుక్రవారం నుండి పెట్రోల్ ధర   రూ.106.86, డీజిల్ ధర రూ.90.95 కి దిగోచ్చింది.

నాగాలాండ్
నాగాలాండ్ ప్రభుత్వం గురువారం పెట్రోల్, డీజిల్‌పై లీటరుకు రూ.7 చొప్పున విలువ ఆధారిత పన్ను (వ్యాట్) తగ్గింపును ప్రకటించింది. కేంద్ర, రాష్ట్ర పన్నుల తగ్గింపుతో  ఈశాన్య రాష్ట్రంలో పెట్రోల్ లీటరుకు రూ.12, డీజిల్ రూ.17 తగ్గుతుంది

చండీగఢ్
చండీగఢ్ అడ్మినిస్ట్రేషన్ గురువారం నవంబర్ 4 అర్ధరాత్రి నుండి పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌ను  రూ.7 తగ్గిస్తున్నట్లు ప్రకటించింది .

హిమాచల్ ప్రదేశ్
పెట్రోల్‌పై విలువ ఆధారిత పన్ను (వ్యాట్) లీటరుకు రూ.2, డీజిల్‌పై రూ.4.60 తగ్గిస్తున్నట్లు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం గురువారం ప్రకటించింది. దీంతో పెట్రోల్ లీటరుకు  రూ.12 తగ్గగా , డీజిల్ కూడా లీటరుకు  రూ.17 తగ్గుతుందని ముఖ్యమంత్రి జై రామ్ ఠాకూర్ చెప్పారు .

జమ్మూ కాశ్మీర్
జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం గురువారం పెట్రోల్, డీజిల్  ధరలను లీటరుకు రూ.7 అదనంగా తగ్గించింది. ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం, కేంద్ర పాలిత ప్రాంతంలో ఇప్పుడు పెట్రోల్‌పై 24 శాతం, డీజిల్‌పై 16 శాతం విలువ ఆధారిత పన్ను (వ్యాట్) విధించబడుతుంది.

పుదుచ్చేరి
పుదుచ్చేరిలోని AINRC నేతృత్వంలోని NDA ప్రభుత్వం గురువారం పెట్రోల్, డీజిల్‌పై విలువ ఆధారిత పన్ను (VAT)ని లీటరుకు  రూ.7 తగ్గిస్తున్నట్లు ప్రకటించింది, అలాగే తగ్గిన ధరలు తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపింది.

కర్ణాటక
డీజిల్, పెట్రోల్ ధరలను లీటరుకు రూ.7 చొప్పున తగ్గిస్తూ కర్ణాటక ప్రభుత్వం గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది , అదే విధంగా కేంద్రం డీజిల్ పై రూ.10,  పెట్రోల్ పై రూ.5 తగ్గించింది. 

పెట్రోల్‌, డీజిల్‌పై సేల్స్ ట్యాక్స్ ను తగ్గించిన తొలి రాష్ట్రం కర్ణాటక అని రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. దీంతో డీజిల్ ధరల నవంబర్ 3న రూ.104.50 నుండి  రూ.85.03కి అంటే  రూ.19.47 తగ్గింది.

పెట్రోల్ ధరలు  నవంబర్ 3న రూ.113.93 నుండి రూ.100.63కి అంటే రూ.13,30 దిగోచ్చింది.


మిజోరం
ఇంధనంపై సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీని తగ్గిస్తున్నట్లు కేంద్రం ప్రకటించిన ఒక రోజు తర్వాత మిజోరం ప్రభుత్వం గురువారం పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు రూ.7 చొప్పున తగ్గించిందని ముఖ్యమంత్రి జోరమ్‌తంగా తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న ప్రగతిశీల నిర్ణయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేశారని ఆయన అన్నారు.
 

హర్యానా
హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ గురువారం పెట్రోల్, డీజిల్‌పై విలువ ఆధారిత పన్ను (వ్యాట్)ని రూ.12 తగ్గిస్తున్నట్లు ప్రకటించారు .

గుజరాత్
గుజరాత్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై విలువ ఆధారిత పన్ను (వ్యాట్)ని లీటరుకు రూ.7 చొప్పున తగ్గించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది.

బీహార్
వాహన వినియోగదారులకు ఉపశమనం కలిగించే ప్రయత్నంలో కేంద్రం ఇంధన ధరల పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన ఒక రోజు తర్వాత బీహార్‌లోని నితీష్ కుమార్ ప్రభుత్వం గురువారం పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ రేటును లీటరుకు రూ.3 కంటే పైగా తగ్గించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి ట్విట్టర్ హ్యాండిల్‌లో ఓ ప్రకటన చేశారు.


దేశంలోని ప్రముఖ నగరాల్లో డీజిల్, పెట్రోల్ ధరలు క్రింది విధంగా ఉన్నాయి:

ముంబై

పెట్రోలు - లీటరుకు రూ.109.98

డీజిల్ - లీటరుకు రూ.94.14

ఢిల్లీ

పెట్రోలు - లీటరుకు రూ.103.97

డీజిల్ - లీటరుకు రూ.86.67

చెన్నై

పెట్రోలు - లీటరుకు రూ.101.40

డీజిల్ - లీటరుకు రూ.91.43

కోల్‌కతా

పెట్రోలు - లీటరుకు రూ.104.67

డీజిల్ - లీటరుకు రూ.89.79
 

భోపాల్

పెట్రోలు - లీటరుకు రూ.107.23

డీజిల్ - లీటరుకు రూ.90.87

హైదరాబాద్

పెట్రోలు - లీటరు రూ.108.20

డీజిల్ - లీటరుకు రూ.94.62

బెంగళూరు

పెట్రోలు - లీటరు రూ.100.58

డీజిల్ - లీటరుకు రూ.85.01

చండీగఢ్

పెట్రోలు - లీటరుకు రూ.100.12

డీజిల్ - లీటరుకు రూ.86.46

గౌహతి

పెట్రోలు - లీటరు రూ.94.58

డీజిల్ - లీటరుకు రూ.81.29

లక్నో

పెట్రోలు - లీటరు రూ.95.28

డీజిల్ - లీటరుకు రూ.86.80

గాంధీనగర్

పెట్రోలు - లీటరు రూ.95.35

డీజిల్ - లీటరుకు రూ.89.33

తిరువనంతపురం

పెట్రోలు - లీటరుకు రూ.106.36

డీజిల్ - లీటరుకు రూ.93.47

గురువారం హైదరాబాద్ నగరంలో పెట్రోల్ లీటర్ ధర రూ. 6.33 తగ్గి.. రూ. 108.18గా ఉంది. లీటర్ డీజిల్ ధర రూ. 12.79 తగ్గి రూ. 94.61గా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో అమరావతిలో లీటరు పెట్రోల్ ధర రూ.110.67కు,  డీజిల్ ధర రూ.96.08కు తగ్గింది. 

click me!