దీపావళికి బంగారం ధరలకు మళ్ళీ రెక్కలు.. ఒక్కరోజులులో ఎంత పెరిగిందంటే..?

First Published Nov 5, 2021, 2:48 PM IST

న్యూఢిల్లీ:  దీపావళికి ముందు స్వల్పంగా తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు దీపావళి(diwali) రోజున పెరుగుదలను నమోదు చేసింది. దీపావళి పండుగ ఒకరోజు తరువాత నవంబర్ 5న శుక్రవారం  భారతదేశంలో బంగారం (gold price)ధర  మళ్ళీ పెరిగింది. గత కొన్ని వారాలుగా ముఖ్యంగా దీపావళికి ముందు ధన్‌తేరస్ సమయంలో బంగారం ధరలు ఒత్తిడికి గురవుతోంది.

మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో డిసెంబర్ బంగారం ధర నవంబర్ 5న 09.05 గంటల సమయానికి 10 గ్రాములకు 1.21 శాతం పెరిగి రూ.47,571కి చేరుకుంది. మరోవైపు  వెండి ధర కూడా భారీగా పెరిగింది. నవంబర్ 5న వెండి ధర 2.82 శాతం పెరిగి రూ.64,224 వద్ద ట్రేడవుతోంది.

అంతర్జాతీయ మార్కెట్‌లో శుక్రవారం బంగారం ధర పెరిగింది. యూ‌ఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంపుపై తొందరపడకూడదని నిర్ణయించిన తర్వాత పసుపు లోహం ధర పెరిగింది. 0216 GMT నాటికి స్పాట్ బంగారం 0.2 శాతం పెరిగి ఔన్సుకు  1,795.64 డాలర్ల వద్ద ఉంది. నివేదిక ప్రకారం యూ‌ఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.2 శాతం పెరిగి 1,796.50 డాలర్లకి చేరుకుంది. బెంచ్‌మార్క్ యూ‌ఎస్ 10-సంవత్సరాల ట్రెజరీ ఈల్డ్‌లు ఒక వారం గరిష్ట స్థాయి నుండి వెనక్కి తగ్గాయి.
 

సెప్టెంబరు త్రైమాసికంలో బంగారం డిమాండ్ ఏడాది ప్రాతిపదికన 47 శాతం పెరిగి 139.1 టన్నులకు చేరుకుంది, గత ఏడాది 94.6 టన్నులుగా ఉంది. బలమైన డిమాండ్, సందర్భానికి సంబంధించిన బహుమతులు, ఆర్థిక పునరుద్ధరణ, తక్కువ ధరల కారణంగా జూలై-సెప్టెంబర్ 2021 కాలంలో భారతదేశంలో ఆభరణాల డిమాండ్ సంవత్సరానికి 58 శాతం పెరిగి 96.2 టన్నులకు చేరుకుంది.బంగారం అనేది ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా నిరూపితమైన దీర్ఘకాలిక రక్షణ. భారతీయ మధ్యతరగతి ప్రజలు ఎల్లప్పుడూ పండుగలు లేదా వివాహాల సమయంలో ఆభరణాలు లేదా ఆస్తులుగా బంగారాన్ని ఎంచుకుంటారు.

గోల్డ్ ఫ్యూచర్ పై మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ మాట్లాడుతూ, “గత దీపావళి నుండి ఈ దీపావళి వరకు బులియన్‌లు కన్సాలిడేషన్ మోడ్‌లో ఉన్నాయి. గత కొన్ని నెలలుగా యూ‌ఎస్ డాలర్‌లో అస్థిరత, బాండ్ ఈల్డ్‌ల మధ్య కొంత అస్థిరతను చూసింది అని అన్నారు. రానున్న 12 నెలల్లో బంగారం ధరలు రూ.52,000-53,000 గరిష్ట స్థాయికి ఎగబాకవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

ఈ రోజు భారతదేశంలోని అగ్ర నగరాల్లో బంగారం ధరలు:

న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,700గా ఉండగా, ఈ ఉదయం ముంబైలో రూ.46,410గా ఉంది. చెన్నైలో  రూ. 44,470గా, కోల్‌కతా నగరంలో  22 క్యారెట్ల 10 గ్రాములకు రూ.47,850 వద్ద ఉంది.

 న్యూ ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ 50.900 వద్ద  ఉండగా, ముంబైలో రూ.47.410గా ఉంది. చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,500గా, కోల్‌కతాలో రూ.50,550గా చేరింది.

మరోవైపు బెంగళూరు, కేరళలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.48,600గా ఉంది. ఇంకా ఈ రెండు చోట్ల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ. 44,550గా ఉంది. తాజాగా అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.44,550కి చేరింది. 24 క్యారెట్ల బంగారం రూ.48,600కు పెరిగింది.  

ఇక్కడ పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం 8 గంటలకు నమోదైనవి. అలాగే ప్రతిరోజూ మారుతూ ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్ కరెన్సీ ధరలలో మార్పు, ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, ఆభరణాల మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు ఇతర కారణాల వల్ల బంగారం ధర మారడానికి ఎన్నో కారణాలు ఉన్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.  

ఐ‌బి‌జే‌ఏ రేట్లు
మీరు ఇండియా బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ లిమిటెడ్ అంటే IBJA ధరలను పరిశీలిస్తే చివరి అప్‌డేట్‌తో నేడు బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి- (ఈ ధరలు GST ఛార్జ్ లేకుండా గ్రాముకు )

999 (స్వచ్ఛత) - రూ.47,836
995- రూ.47,644
9l6- రూ.43,818
750- రూ.35,877
585- రూ.27,984
వెండి 999- రూ.64,208

click me!