Gold Price Hike: ఊగిసలాడుతున్న పసిడి..రోజుకో రేటుతో గోల్డ్ మార్కెట్‌లో టెన్షన్

Published : Sep 12, 2026, 11:53 AM IST

Gold Price Hike: బంగారం ధరలు మరోసారి మలుపు తీసుకున్నాయి. వరుసగా ఒకరోజు పెరుగుదల.. మరోరోజు తగ్గుదలతో పసిడి మార్కెట్‌లో తీవ్ర ఒడిదొడుకులు కనిపిస్తున్నాయి. నిన్నటి వరకు ధరలు తగ్గుతుండటంతో కొనుగోలుదారులకు కాస్త ఊరట లభించినా.. తాజాగా మరోసారి ఎగబాకాయి.

PREV
14
ఊగిసలాడుతున్న బంగారం, వెండి

గత కొన్ని రోజులుగా దేశీయ మార్కెట్‌లో గోల్డ్ రేట్లు ఒక స్థిరమైన దిశలో సాగడం లేదు. ఒక్కసారిగా పెరగడం.. ఆ తర్వాతే తగ్గిపోవడం.. మళ్లీ స్వల్పంగా పుంజుకోవడం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో రేపటి ధర ఎలా ఉంటుందో అంచనా వేయడం కూడా కష్టంగా మారింది. అంతర్జాతీయ మార్కెట్లలో జరుగుతున్న పరిణామాలు దేశీయ బులియన్ మార్కెట్‌పై ప్రభావం చూపుతుండటమే ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది.

24
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు

ముఖ్యంగా పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ఇన్వెస్టర్లను అప్రమత్తం చేస్తున్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతల ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. భౌగోళిక రాజకీయ పరిస్థితులు మరింత తీవ్రతరం అయితే మార్కెట్లలో అనిశ్చితి పెరిగే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయంలో పెట్టుబడిదారులు సురక్షితమైన పెట్టుబడుల వైపు దృష్టి సారించడం వల్ల బంగారానికి డిమాండ్ పెరిగే అవకాశముంటుంది.

34
స్వల్పంగా పెరిగిన బంగారం

ఈ ప్రభావాల మధ్య శుక్రవారం బంగారం ధరలు గణనీయంగా తగ్గాయి. అయితే ఆ పతనం ఎక్కువ కాలం కొనసాగలేదు. శనివారం మార్కెట్‌లో మళ్లీ స్వల్పంగా ధరలు పెరిగాయి. అంటే ఒకవైపు అంతర్జాతీయ పరిణామాలు.. మరోవైపు మార్కెట్‌లో కొనుగోళ్లు, అమ్మకాల ప్రభావంతో పసిడి రేట్లు తీవ్ర హెచ్చుతగ్గులకు గురవుతున్నాయి.

44
హైదరాబాద్ లో బంగారం ధరలు ఇలా..

24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.1,54,800 వద్ద కొనసాగుతోంది. నిన్నటితో పోలిస్తే ఇవాళ రూ.160 పెరిగింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.1,41,700గా ఉంది. ఈ రేటు కూడా ఒక్కరోజులో రూ.150 పెరిగింది. విజయవాడ, విశాఖపట్నం మార్కెట్లలోనూ ఇదే స్థాయిలో బంగారం ధరలు కొనసాగుతున్నాయి. అంటే ప్రధాన నగరాల్లో పసిడి రేట్లలో పెద్దగా వ్యత్యాసం కనిపించడం లేదు. మరోవైపు వెండి ధరల్లో మాత్రం ఇవాళ పెద్దగా మార్పు కనిపించలేదు. చెన్నై మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.2.50 లక్షల వద్ద స్థిరంగా కొనసాగుతోంది.

Read more Photos on
click me!

Recommended Stories