Gold Silver Price: ఏంటీ ఇది నిజమా? రూ.లక్షకు పడిపోతున్న బంగారం, కుప్పకూలుతున్న వెండి

Published : Nov 17, 2026, 11:49 AM IST

Gold Silver Price: బంగారం కొనాలనుకునే వారికి మరోసారి ఊరట లభించింది. దేశీయ మార్కెట్లో పసిడి ధరలు భారీగా తగ్గాయి. అంతర్జాతీయ పరిణామాలతో వరుసగా దిగివస్తున్న బంగారం రేట్లు పెళ్లిళ్ల సీజన్‌లో కొనుగోలుదారులకు కలిసివస్తున్నాయి. తాజా ధరలు ఎలా ఉన్నాయంటే..

PREV
14
బంగారం ధరలకు బ్రేక్

దేశీయ బులియన్ మార్కెట్లో పసిడి ధరల పతనం కొనసాగుతోంది. కొద్ది రోజులుగా వరుసగా తగ్గుతున్న బంగారం రేట్లు తాజాగా మరోసారి దిగివచ్చాయి. దీంతో ఆభరణాలు కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి కొంత ఊరట లభిస్తోంది. ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్‌లో బంగారం కొనుగోలు చేయాలనుకునే కుటుంబాలకు ఈ ధరల తగ్గుదల కలిసి వచ్చే అవకాశముంది. మరోవైపు వెండి ధర మాత్రం ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతోంది.

24
పసిడి ధరలు తగ్గడానికి కారణాలివే!

అంతర్జాతీయ మార్కెట్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు బంగారం ధరలపై ప్రభావం చూపిస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా డాలర్ బలపడటం, ట్రెజరీ బాండ్లపై రాబడులు పెరగడం పసిడికి ప్రతికూలంగా మారాయి. సాధారణంగా డాలర్ విలువ పెరిగినప్పుడు ఇతర కరెన్సీలు కలిగిన వారికి బంగారం కొనుగోలు ఖరీదుగా మారుతుంది. దీంతో అంతర్జాతీయంగా పసిడికి డిమాండ్ తగ్గే అవకాశం ఉంటుంది.

మరోవైపు అమెరికా ట్రెజరీ బాండ్లపై ఈల్డ్స్ పెరగడంతో ఇన్వెస్టర్లు వాటివైపు ఆకర్షితులవుతున్నారు. బంగారంపై పెట్టుబడి పెడితే వడ్డీ రూపంలో ఆదాయం రాదు. అదే బాండ్లలో పెట్టుబడులు పెడితే రాబడి పొందే అవకాశం ఉంటుంది. దీంతో కొందరు మదుపరులు బంగారంలో తమ పెట్టుబడులను తగ్గించి ఇతర మార్గాల వైపు మళ్లిస్తున్నారు. ఈ విక్రయాల ఒత్తిడి కూడా పసిడి ధరల తగ్గుదలకు కారణమవుతోంది.

34
తులం బంగారంపై రూ.760 తగ్గుదల

తాజా ధరలను పరిశీలిస్తే 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం రేటు భారీగా తగ్గింది. 10 గ్రాములపై రూ.760 దిగివచ్చింది. దీంతో ప్రస్తుతం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,36,040 వద్ద కొనసాగుతోంది. ఆభరణాల తయారీలో ఎక్కువగా ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గింది. 10 గ్రాములపై రూ.700 తగ్గడంతో ప్రస్తుతం తులం ధర రూ.1,24,700కు చేరింది. వరుసగా ధరలు తగ్గుతుండటంతో బంగారం కొనుగోలు చేయాలనుకునేవారు మార్కెట్ కదలికలను ఆసక్తిగా గమనిస్తున్నారు.

వెండి ధరలో మార్పు లేదు బంగారం ధరలు తగ్గినప్పటికీ వెండి మాత్రం స్థిరంగా కొనసాగుతోంది. కిలో వెండి ధరలో ఎలాంటి మార్పు నమోదు కాలేదు. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో కిలో వెండి రేటు రూ.1,90,000 వద్ద ఉంది.

44
కొనుగోలుదారులకు ఇదే మంచి అవకాశమా?

పెళ్లిళ్ల సీజన్ నేపథ్యంలో బంగారం ధరలు తగ్గడం వినియోగదారులకు కొంత ఊరటనిచ్చే పరిణామమే. అయితే రానున్న రోజుల్లో ధరలు మరింత తగ్గుతాయా? మళ్లీ పెరుగుతాయా? అనేది అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలపై ఆధారపడి ఉంటుంది. డాలర్ విలువ, అమెరికా బాండ్ ఈల్డ్స్, ఇన్వెస్టర్ల కొనుగోళ్లు, విక్రయాల ఒత్తిడి పసిడి ధరల గమనాన్ని నిర్ణయించనున్నాయి. కాబట్టి ఆభరణాలు కొనుగోలు చేసేవారు రోజువారీ ధరలను పరిశీలించడంతో పాటు మేకింగ్ ఛార్జీలు, జీఎస్టీ వంటి అదనపు ఖర్చులను కూడా పరిగణనలోకి తీసుకోవాలి.

Read more Photos on
click me!

Recommended Stories