Indian Railways: విద్యార్థులకు ఇండియన్ రైల్వే బంపర్ ఆఫర్.. వారికి ఉచిత ప్రయాణ సదుపాయం

Published : Nov 16, 2026, 01:41 PM IST

Indian Railways: ఇండియన్ రైల్వే విద్యార్థులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. స్కూల్, కాలేజీ విద్యార్థులు రోజూ రైలులో ఉచితంగా ప్రయాణించే సదుపాయాన్ని అందిస్తోంది. దానికి ఎవరు అర్హులో ఇక్కడ ఇచ్చాము.

PREV
13
విద్యార్థులకు ఉచిత రైలు ప్రయాణ సదుపాయం

ఇండియన్ రైల్వేస్ విద్యార్థుల ప్రయాణ ఖర్చులను తగ్గించేందుకు బంపర్ ఆఫర్లు ఇస్తోంది. కానీ ఈ విషయం ఎంతో మంది విద్యార్థులకు తెలియదు. ఈ ఆఫర్ ప్రకారం అర్హులైన విద్యార్థులు తమ ఇల్లు, చదివే కాలేజీ, స్కూలు మధ్య ఉచితంగా ప్రయాణించేందుకు సెకండ్ క్లాస్ మంత్లీ సీజన్ టిక్కెట్‌ను పొందవచ్చు. రైల్వే అధికారిక రాయితీల జాబితాలో గ్రాడ్యుయేషన్ వరకు చదివే బాలికలకు, 12వ తరగతి వరకు చదివే బాలురకు ఈ ఉచిత ప్రయాణ సదుపాయాన్ని అందిస్తోంది. ఇందుకోసం ముందుగానే ఉచిత మంత్లీ పాస్ తీసుకోవాలి.

ఉచిత మంత్లీ పాస్ కొన్ని షరతులకు లోబడి ఇస్తారు. విద్యార్థుల ఇల్లు, పాఠశాల మధ్య గరిష్టంగా 150 కి.మీ. దూరం వరకు ప్రయాణించవచ్చు. ఈ సదుపాయం సెకండ్ క్లాస్‌లో మాత్రమే వర్తిస్తుంది. అలాగే, ఈ ఉచిత పాస్ మెయిల్, ఎక్స్‌ప్రెస్, సూపర్ ఫాస్ట్ రైళ్లలో ప్రయాణించడానికి అనుమతించదు. ప్రతి నెలా ఈ పాస్ ను కొత్తగా తీసుకోవాలి. కాబట్టి, ప్రయాణించే రైలు, స్టేషన్లకు అనుగుణంగా నిబంధనలను తనిఖీ చేయాలి.

23
పాస్ ఎలా పొందాలి?

విద్యార్థులు తమ పాఠశాల లేదా కళాశాల గుర్తింపు కార్డు, విద్యా సంస్థ ధృవీకరణ పత్రం, అవసరమైన ఫోటో డాక్యుమెంట్లతో సమీప రైల్వే స్టేషన్ టికెట్ కౌంటర్‌కు వెళ్లాలి. అక్కడ ఉచిత మంత్లీ పాస్ కోసం అర్హత, దరఖాస్తు విధానాలను అడిగి తెలుసుకోవాలి. అధికారులు డాక్యుమెంట్లను తనిఖీ చేసిన తర్వాత అర్హత ఆధారంగా పాస్ ఇస్తారు. ఈ పాస్ పేర్కొన్న ఇల్లు, విద్యా సంస్థ మధ్య ఉన్న స్టేషన్లకు మాత్రమే చెల్లుతుంది.

33
50% నుంచి 75% వరకు ఛార్జీల్లో రాయితీ

ఒకవేళ మీకు ఉచిత ప్రయాణానికి అర్హత లేకపోతే రైల్వే ఛార్జీల్లో రాయితీలను అందిస్తుంది. జనరల్ కేటగిరీ విద్యార్థులు సొంతూరికి వెళ్లేందుకు, విద్యా పర్యటనలకు సెకండ్ క్లాస్, స్లీపర్ క్లాస్‌లో 50 శాతం రాయితీ పొందవచ్చు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఇదే ప్రయాణాలకు 75 శాతం రాయితీ ఇస్తారు. గ్రామీణ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఏడాదికోసారి విద్యా పర్యటన కోసం సెకండ్ క్లాస్‌లో 75 శాతం రాయితీ కూడా ఉంది.

యూపీఎస్సీ, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రధాన రాత పరీక్షలకు హాజరయ్యే వారికి సెకండ్ క్లాస్‌లో 50 శాతం ఛార్జీ రాయితీ ఇస్తారు. అలాగే, 35 ఏళ్ల వరకు ఉన్న రీసెర్చ్ స్కాలర్లు పరిశోధన పనుల కోసం సెకండ్ క్లాస్, స్లీపర్ క్లాస్‌లో 50 శాతం రాయితీ పొందవచ్చు. ఈ రాయితీల కోసం అవసరమైన సర్టిఫికెట్లను సమర్పించాలి. పూర్తి నిబంధనలను ఇండియన్ రైల్వే వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవడం ముఖ్యం.

Read more Photos on
click me!

Recommended Stories