Gold Price Fall: ఊగిసలాడుతున్న పసిడి.. మళ్లీ భారీ పతనం..అయోమయంలో కొనుగోలుదారులు

Published : Sep 21, 2026, 10:42 AM IST

Gold Price Fall: బంగారం ధరలు ఎటు వెళ్తున్నాయో అర్థం కావడం లేదు. ఒక్కరోజు భారీగా పెరుగుతుంటే.. మరోరోజు అంతే వేగంగా పడిపోతున్నాయి. ఇంతలో మళ్లీ బంగారం ధరలు భారీగా పడిపోయాయి. అసలు పసిడి ధరల్లో ఈ ఊగిసలాటకు కారణమేంటి?

PREV
15
పసిడి ప్రియులకు గుడ్ న్యూస్

బంగారం ధరలు మళ్లీ ఊగిసలాడుతున్నాయి. ఒకరోజు భారీగా పెరిగితే.. మరుసటి రోజే తగ్గుతున్నాయి. దీంతో పసిడి కొనాలనుకునేవారికి అసలు ఏ సమయంలో కొనుగోలు చేయాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. గత కొన్ని రోజులుగా బంగారం, వెండి మార్కెట్‌లో ఇదే అనిశ్చితి కనిపిస్తోంది. ఇటీవల బంగారం ధరలు భారీ స్థాయికి చేరడంతో కొందరు కొనుగోలు నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నారు. ధరలు మరింత తగ్గితే అప్పుడు కొనుగోలు చేద్దామని కొందరు చూస్తుంటే.. మరోవైపు రేట్లు మళ్లీ పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నవారు ఇప్పుడే పెట్టుబడి పెట్టాలని చూస్తున్నారు. ఈ కారణంగా జ్యువెలరీ మార్కెట్‌లో కొనుగోళ్లపై కొంత ప్రభావం కనిపిస్తున్నట్లు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.

25
రూ.1,55,680 చేరిన బంగారం

అయితే తాజాగా హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో పసిడి ధరలకు స్వల్ప ఊరట కనిపించింది. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.160 తగ్గి రూ.1,55,680కి చేరుకుంది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గింది. 10 గ్రాములపై రూ.150 తగ్గడంతో రూ.1,42,680 వద్దకు చేరింది. మరోవైపు వెండి ధర మాత్రం కిలోకు రూ.2.60 లక్షల వద్ద కొనసాగుతోంది. అంటే బంగారంలో తగ్గుదల కనిపించినా.. వెండి మాత్రం అదే స్థాయిలో ఉంది.

35
ఊగిసలాడుతున్న పసిడి

అసలు బంగారం ధరలను ఇంతలా ఊగిసలాడిస్తున్న అంశాలు ఏంటి అనేది ఇప్పుడు కీలకంగా మారింది. అంతర్జాతీయ మార్కెట్లలో భౌగోళిక ఉద్రిక్తతలు, అమెరికా వడ్డీ రేట్ల నిర్ణయాలు, డాలర్ కదలికలు, చమురు ధరలు వంటి అంశాలు పసిడి మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నాయి. తాజాగా అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి పెరగడంతో అంతర్జాతీయ మార్కెట్లలోనూ అనిశ్చితి కొనసాగుతోంది.

45
మిడిల్ ఈస్ట్ లో సంక్లిష్టంగా మారుతున్న పరిస్థితులు

మిడిల్ ఈస్ట్‌లో పరిస్థితులు కూడా మరింత సంక్లిష్టంగా మారుతున్నాయి. ఇరాన్-అమెరికా మధ్య మాటల యుద్ధం కొనసాగుతుండగా.. యెమెన్‌కు చెందిన హూతీలు సౌదీ అరేబియాపై దాడులు కొనసాగిస్తున్నాయి. అదే సమయంలో అమెరికా నౌకలను లక్ష్యంగా చేసుకోబోమని హూతీలకు చెందిన ఓ సీనియర్ నేత ప్రకటించారు. ఈ పరిణామాలు రెడ్ సీ, హర్మూజ్ వంటి కీలక సముద్ర మార్గాలపై దృష్టిని పెంచుతున్నాయి.

ఇలాంటి భౌగోళిక పరిణామాలు ప్రపంచ ఆర్థిక మార్కెట్లలో అనిశ్చితిని పెంచుతుంటాయి. అయితే బంగారం ధర ఒక్క దిశలోనే కదులుతుందని చెప్పలేం. వడ్డీ రేట్లు, డాలర్ బలం, చమురు ధరలు, అంతర్జాతీయ మార్కెట్‌లో పెట్టుబడిదారుల కదలికలు.. అన్నీ కలిపి పసిడి ధరపై ప్రభావం చూపుతాయి. ఇటీవల ఫెడ్ వడ్డీ రేట్ల నిర్ణయం తర్వాత కూడా బంగారం మార్కెట్‌లో గణనీయమైన కదలిక కనిపించింది.

55
మార్కెట్లు గమనించాలి

అయితే బంగారం కొనుగోలు విషయంలో రోజువారీ ధరలను మాత్రమే కాకుండా.. ఆభరణాలపై మేకింగ్ ఛార్జీలు, జీఎస్టీ వంటి అదనపు ఖర్చులను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ముఖ్యంగా ధరల్లో వేగంగా మార్పులు వస్తున్న సమయంలో కొనుగోలు చేసే ముందు అదే రోజు స్థానిక మార్కెట్ రేటును చెక్ చేసుకోవడం మంచిది.

Read more Photos on
click me!

Recommended Stories