Gold Price Fall: దసరా వేళ బంగారం భారీ పతనం...పసిడి ప్రియులకు పండగే పండగ

Published : Oct 03, 2026, 11:02 AM IST

Gold Price Fall: దసరాకి బంగారం కొనాలనుకుంటున్నారా? అయితే ఇవాళ్టి రేట్లు భారీ ఊరట కలిగించాయి. ఒక్కరోజులోనే పసిడి ధరలు పడిపోయాయి. 10 గ్రాముల బంగారంపై ఏకంగా రూ.1,100 వరకు కోత పడింది.అయితే ఈ తగ్గుదల ఇక్కడితో ఆగుతుందా? లేక మళ్లీ ధరలు పెరిగే అవకాశం ఉందా?

PREV
15
దసరా ధరలు

దసరాకి బంగారం కొనాలని ప్లాన్ చేస్తున్నవారికి ఇవాళ మార్కెట్‌ నుంచి భారీ ఊరట దొరికింది. గత కొంతకాలంగా భారీ హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు మరోసారి తగ్గాయి. పండుగ సీజన్ దగ్గరపడుతున్న సమయంలో వచ్చిన ఈ తగ్గుదల కొనుగోలుదారులకు కొంత ఊరటనిస్తోంది.

25
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు

అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితి, పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు బంగారం ధరలపై ప్రభావం చూపుతున్నాయి. దీంతో గోల్డ్ మార్కెట్‌లో రేట్లు ఎప్పుడు ఎలా మారతాయో అంచనా వేయడం కష్టంగా మారింది. గత నెలలో భారీ స్థాయిలో కదిలిన పసిడి ధరలు.. ఈ నెలలో ఏ దిశగా వెళ్తాయన్నది ఆసక్తికరంగా మారింది.

35
పండక్కి కొనుగోళ్లు పెరిగే అవకాశం

ముఖ్యంగా పండుగ సీజన్‌లో బంగారం కొనుగోళ్లు పెరిగే అవకాశం ఉండటంతో.. ప్రస్తుత ధరల మార్పులను కొనుగోలుదారులు నిశితంగా గమనిస్తున్నారు. ఇప్పుడు హైదరాబాద్‌లో ఇవాళ్టి గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,100 తగ్గింది. దీంతో ప్రస్తుతం 24 క్యారెట్ల పసిడి ధర రూ.1,49,180గా నమోదైంది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గింది. 10 గ్రాములపై రూ.1,000 తగ్గడంతో.. ప్రస్తుతం రూ.1,36,750 వద్ద ట్రేడవుతోంది. ఇక 18 క్యారెట్ల బంగారం ధర విషయానికి వస్తే.. 10 గ్రాములపై రూ.820 తగ్గింది. దీంతో 18 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,11,890కి చేరింది.

45
విజయవాడలో ధరలు ఇలా ఉన్నాయి

విజయవాడలోనూ ఇవాళ బంగారం ధరలు హైదరాబాద్‌లోనే కొనసాగుతున్నాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.1,49,180గా ఉంది. 22 క్యారెట్ల బంగారం రూ.1,36,750 వద్ద, 18 క్యారెట్ల బంగారం రూ.1,11,890 వద్ద నమోదైంది.

55
పసిడి ధరల్లో మళ్లీ హెచ్చుతగ్గులు

పండుగ సీజన్‌కు ముందు బంగారం ధరల్లో వచ్చిన ఈ తగ్గుదల కొనుగోలుదారులకు కొంత ఊరటనిచ్చే అంశంగా మారింది. అయితే అంతర్జాతీయ పరిస్థితులు, మార్కెట్‌లోని పరిణామాలను బట్టి రాబోయే రోజుల్లో పసిడి ధరల్లో మళ్లీ హెచ్చుతగ్గులు ఉండే అవకాశం ఉంది. అందుకే బంగారం కొనుగోలు చేయాలనుకునేవారు రోజువారీ ధరలను గమనించి నిర్ణయం తీసుకోవడం మంచిది.

Read more Photos on
click me!

Recommended Stories