Aadhaar Update: ఇకపై ఆధార్ కార్డు యూజర్లకు కష్టాలు తప్పనున్నాయి. కేంద్ర ప్రభుత్వం 5 ముఖ్యమైన అప్ డేట్స్ తీసుకొచ్చింది. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ఆ కొత్త మార్పులు ఏంటో ఇక్కడ తెలుసుకోండి.
ఇకపై ఆధార్ కార్డు యూజర్లకు కష్టాలు తప్పనున్నాయి. కేంద్ర ప్రభుత్వం 5 ముఖ్యమైన అప్ డేట్స్ తీసుకొచ్చింది. కేంద్రం, విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పాయి. ఆధార్ సేవలను మరింత వేగంగా, సులభంగా మార్చేందుకు UIDAI ఐదు కీలక మార్పులు చేసింది.
26
ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్
గతంలో రేషన్ షాపుల్లో వేలిముద్రలు పడక చాలామంది ఇబ్బంది పడేవారు. అయితే ఆ కష్టాలు తీరనున్నాయి. వేలిముద్రలకు బదులుగా 'ఫేస్ వెరిఫికేషన్' ద్వారా కూడా ప్రజలు రేషన్ సరుకులు తీసుకోవచ్చు. ఇది చాలా ఈజీ కూడాను. ముసలివాళ్లు, పనులకెళ్లే వాళ్ల వేలిముద్రలు పడక నానా అవస్థలు పడేవారు. ఇకపై ఆ టెన్షన్ ఉండదు.
36
ఆధార్ కేంద్రాల్లో టోకెన్ సిస్టమ్
దేశవ్యాప్తంగా ఉన్న ఆధార్ సేవా కేంద్రాల్లో రద్దీని తగ్గించేందుకు అధికారులు కొత్త టోకెన్ విధానాన్ని తీసుకొచ్చారు. దీనివల్ల ప్రజలు గంటల తరబడి క్యూ లైన్లలో నిల్చోవాల్సిన అవసరం ఉండదు.
తక్కువ స్థాయి వెరిఫికేషన్ అవసరమైన సంస్థల కోసం UIDAI కొత్తగా AUA, KUA ఫ్రేమ్‌వర్క్‌ను పరిచయం చేసింది. దీని ద్వారా ఆయా సంస్థలు ఆధార్ అథెంటికేషన్ సిస్టమ్‌తో చాలా సులభంగా అనుసంధానం కావచ్చు.
56
SWIK పోర్టల్ 2.0
ప్రభుత్వేతర సంస్థలు (NGOs) ఆధార్ అథెంటికేషన్ అనుమతులు పొందేందుకు 'SWIK 2.0' అనే ఆన్‌లైన్ పోర్టల్‌ను అధికారులు ప్రారంభించారు. దీని ద్వారా దరఖాస్తు ప్రక్రియ చాలా సులభం అవుతుంది.
66
వెబ్‌సైట్, మరిన్ని భాషలు
UIDAI తన అధికారిక వెబ్‌సైట్‌ను కొత్త డిజైన్‌తో అప్‌డేట్ చేసింది. ఇందులో స్క్రీన్ రీడర్, మెరుగైన ఫాంట్ సదుపాయాలను చేర్చారు. ప్రస్తుతం 13 భాషల్లో ఉన్న ఈ వెబ్‌సైట్ సేవలను త్వరలోనే 23 భాషలకు విస్తరించనున్నారు.