Gold Price Hike: మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలతో మళ్లీ భగ్గుమన్న బంగారం.. ఒక్కరోజులో రూ.1,200 పెరుగుదల!

Published : Sep 08, 2026, 10:56 AM IST

Gold Price Hike: బంగారం ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. ఒక్కరోజులోనే 24 క్యారెట్ల పసిడి రూ.1,200 పెరిగింది. వెండి కూడా భారీ స్థాయిలో కొనసాగుతోంది. అసలు గోల్డ్ రేట్లు మళ్లీ ఎందుకు పెరుగుతున్నాయి? ఈ పెరుగుదల ఇక్కడితో ఆగుతుందా?

PREV
14
బంగారం ధరలు పైపైకి

అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల ప్రభావం బులియన్ మార్కెట్‌పై కనిపిస్తోంది. కొద్దిరోజులుగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రం కావడం, అమెరికా-ఇరాన్ మధ్య ఘర్షణలు ముదరడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తమయ్యారు. ఈ పరిస్థితుల్లో సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారానికి డిమాండ్ పెరగడంతో దేశీయ మార్కెట్లో పసిడి ధరలు పైకి కదిలాయి.

24
ద్రవ్యోల్బణం మళ్లీ తీవ్రం కావచ్చనే అంచనాలు

మరోవైపు హోర్ముజ్ జలసంధి పరిణామాలు కూడా అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి. ఈ మార్గం ద్వారా జరిగే చమురు సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందనే ఆందోళనలతో క్రూడాయిల్ ధరలు పెరుగుతున్నాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 97 డాలర్లకు పైగా చేరుకోవడం మార్కెట్లలో ఆందోళనకు కారణమవుతోంది. చమురు ధరలు పెరిగితే రవాణా, తయారీ వ్యయాలు పెరిగి ద్రవ్యోల్బణం మళ్లీ తీవ్రం కావచ్చనే అంచనాలు కూడా బంగారం కొనుగోళ్లకు ఊతమిస్తున్నాయి.

34
రూ.1,55,350 కు చేరిన పసిడి

ఇక హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధరలను పరిశీలిస్తే.. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,200 పెరిగి రూ.1,55,350కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,100 పెరిగి రూ.1,42,400 వద్ద నమోదైంది. 18 క్యారెట్ల పసిడి రేటు కూడా రూ.900 పెరిగి రూ.1,16,510గా ఉంది. ఇక వెండి ధర కిలోకు రూ.2.50 లక్షల వద్ద కొనసాగుతోంది.

44
అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు

అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు, గల్ఫ్ ప్రాంతంలో పరిస్థితులు, క్రూడాయిల్ ధరలు, డాలర్ కదలికలు వంటి అంశాలు ఇకపై బంగారం మార్కెట్‌కు కీలకంగా మారనున్నాయి. ప్రపంచ మార్కెట్లలో అనిశ్చితి ఎక్కువైనప్పుడల్లా సురక్షిత పెట్టుబడుల వైపు నిధులు మళ్లే అవకాశం ఉండటంతో పసిడికి డిమాండ్ కొనసాగవచ్చు. అయితే పరిస్థితులు మారితే ధరల్లో వేగంగా దిద్దుబాటు కూడా కనిపించే అవకాశం ఉంది. దీంతో రానున్న రోజుల్లో బంగారం రేట్లు మరింత పెరుగుతాయా.. లేక మళ్లీ తగ్గుతాయా అనేది ఆసక్తికరంగా మారింది.

Read more Photos on
click me!

Recommended Stories