Gold Price Today: పసిడి ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. కుప్పకూలిన బంగారం ధరలు

Published : Jun 30, 2026, 11:54 AM IST

Gold Price Today: బంగారం కొనాలని ప్లాన్ చేస్తున్నారా? ఈరోజు బులియన్ మార్కెట్ ఓపెన్ అవ్వడమే బంగారం ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. నిన్నటి ధరతో పోలిస్తే వేలల్లో రేట్లు తగ్గాయి. ఈ రోజే బంగారం కొనడం మంచిదా? 

PREV
15
పసిడి ప్రియులకు గుడ్ న్యూస్

ఈరోజు బంగారం కొనుగోలుదారులకు మంగళవారం నిజంగానే శుభవార్త తెచ్చింది. దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పతనమయ్యాయి. లండన్, సింగపూర్ మార్కెట్ల ప్రభావంతో మన హైదరాబాద్‌తో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. 

25
రూ.1,40,130 కు చేరిన బంగారం

ఈరోజు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,40,130 గా నమోదైంది. నిన్నటి ధరతో పోలిస్తే ఏకంగా రూ.1,800 మేర భారీ తగ్గుదల కనిపించింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఈరోజు రూ.1,28,450 వద్ద కొనసాగుతోంది. నిన్నటితో పోలిస్తే ఇది కూడా రూ.1,650 తగ్గింది. 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఈరోజు రూ.1,05,100 కి పడిపోయింది. నిన్నటితో పోలిస్తే రూ.1,350 తగ్గింది. 

35
వెండి ధరలు ఎలా ఉన్నాయి?

మరి బంగారం ధరలు ఇంతలా తగ్గితే... వెండి ధరలు ఎలా ఉన్నాయి? వెండి మార్కెట్లో ఈరోజు పెద్దగా మార్పులు ఏమీ కనిపించలేదు. అంతర్జాతీయంగా స్వల్ప హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ, దేశీయంగా కిలో వెండి ధర ప్రస్తుతం రూ.2,45,000 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. అయితే పారిశ్రామిక అవసరాలు, అంతర్జాతీయ డిమాండ్‌ను బట్టి రానున్న రోజుల్లో వెండి ధరల్లో కూడా మార్పులు వచ్చే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. 

45
దుబాయ్ మార్కెట్లో 10 గ్రాములు రూ.1,25,170

ఇక అంతర్జాతీయ మార్కెట్ల విషయానికి వస్తే... అక్కడ కూడా బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. సింగపూర్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.1,70,200 గా ఉంది. దుబాయ్ మార్కెట్లో రూ.1,25,170 గా కొనసాగుతోంది. 

55
లాభాల స్వీకరణకు మొగ్గు చూపుతున్న పెట్టుబడిదారులు

గత కొన్ని రోజులుగా బంగారం ధరలు విపరీతంగా పెరగడంతో, పెద్ద పెద్ద పెట్టుబడిదారులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. అంటే తమ దగ్గరున్న బంగారాన్ని అమ్మి లాభాలు విత్‌డ్రా చేసుకుంటున్నారు. దీనివల్ల మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి పెరిగి ధరలు తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్లో అమెరికా డాలర్ ఇండెక్స్ బలంగా పుంజుకుంది. సాధారణంగా డాలర్ పెరిగితే బంగారం ధరలు తగ్గుతాయి. ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా పశ్చిమాసియాలో నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతలు కొంత తగ్గుముఖం పట్టడంతో ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం వైపు కాకుండా ఇతర మార్కెట్ల వైపు చూస్తున్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories