Bank Holidays : జూలైలో ఏకంగా 12 రోజుల బ్యాంక్ సెలవులు.. ఏరోజు, ఎందుకో తెలుసా? ఫుల్ లిస్ట్ ఇదిగో

Published : Jun 29, 2026, 03:15 PM IST

ఈ జూలైలో మీకు బ్యాంక్ లో ఏమైనా ముఖ్యమైన పనులు ఉన్నాయా..? అయితే ముందుగానే ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ప్రతి నెలలో మాదిరిగానే జూలైలో కూడా బ్యాంకులకు సెలవులున్నాయి. ఏఏ రోజుల్లో, ఎందుకు బ్యాంకులు మూతపడనున్నాయో ఇక్కడ తెలుసుకుందాం.

PREV
15
జూలై 2026 బ్యాంక్ హాలిడేస్ లిస్ట్

జూన్ 2026 ముగింపుకు చేరుకుంది... మరో రెండ్రోజుల్లో కొత్త నెల జులై ప్రారంభం కానుంది. అయితే జూలైలో ఏదైనా ఆర్థిక వ్యవహారాల కోసం మీరు బ్యాంకుకు వెళ్లాలనుకుంటున్నారా? అయితే ఓ విషయం కచ్చితంగా తెలుసుకోవాల్సిందే. వచ్చే నెలలో దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులు కొన్ని రోజులు పనిచేయవు. దీనివల్ల డబ్బులు విత్ డ్రా, డిపాజిట్ తో పాటు చెక్ డిపాజిట్, కేవైసీ అప్‌డేట్, డిమాండ్ డ్రాఫ్ట్, లాకర్ సేవలకు అంతరాయం కలగొచ్చు. అందుకే ఇక్కడ అందిస్తున్న సమాచారాన్ని బట్టి జూలైలో బ్యాంకు పనులు ఎప్పుడు చేసుకోవాలో ముందుగానే ప్లాన్ చేసుకోవడం మంచిది.

25
జూలైలో బ్యాంకులకు ఎన్నిరోజులు సెలవు?

సాధారణ సెలవులతో పాటు స్థానిక పండుగలు, ప్రత్యేక కార్యక్రమాల సందర్భంగా జూలై, 2026 లో దేశవ్యాప్తంగా బ్యాంకులకు కొన్ని సెలవులున్నాయి. అయితే ముందుగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోని బ్యాంకులకు ఏరోజు, ఎందుకు సెలవుందో తెలుసుకుందాం.

జూలై 5 - ఆదివారం (సాధారణ సెలవు)

జూలై 11 - రెండో శనివారం (ప్రతి నెలలో రెండో శనివారం బ్యాంకులకు సెలవుంటుంది)

జూలై 12 - ఆదివారం (సాధారణ సెలవు)

జూలై 19 - ఆదివారం (సాధారణ సెలవు)

జూలై 25 - నాలుగో శనివారం (ప్రతి నెలలో నాలుగో శనివారం బ్యాంకులకు సెలవుంటుంది)

జూలై 26 - ఆదివారం (సాధారణ సెలవు)

ఈ సెలవులు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోని బ్యాంకులకు వర్తిస్తాయి... అంటే ఈ ఆరురోజులు ఇండియాలోనే ప్రతి బ్యాంక్ మూసివుంటుందన్నమాట. కాబట్టి దేశంలో ఎక్కడ బ్యాంక్ పని ఉన్నా ఈ రోజుల్లో అస్సలు ప్లాన్ చేసుకోవద్దు.

35
జూలై 2026 లో వచ్చే ప్రత్యేక సెలవులెన్ని?

సాధారణంగా వచ్చే రెండు, నాలుగో శనివారాలు, ఆదివారాల సెలవులే కాదు కొన్ని రాష్ట్రాలకు ప్రత్యేక సెలవులు వస్తుంటాయి... ఇవి అన్ని రాష్ట్రాలకు వర్తించవు. ఆ రాష్ట్రానికి సంబంధించిన ప్రత్యేక పర్వదినం, వేడుకల సందర్భంగా ఈ సెలవులు వస్తుంటాయి. కాబట్టి కొన్నిసార్లు ఓ రాష్ట్రంలో బ్యాంకులు తెరిచివున్నా మరో రాష్ట్రంలో మూసివుండే అవకాశాలంటాయి. కాబట్టి వేరే రాష్ట్రంలోని బ్యాంకుల్లో ఏదైనా పనివున్నా ఆ రాష్ట్ర సెలవుల జాబితాను చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం. మరి ఈ జూలైలో ఏ రాష్ట్రంలో, ఏరోజు సెలవుందో తెలుసుకొండి.

జూలై 6 (సోమవారం) - మిజోరాంలోని అతిపెద్ద మహిళా స్వచ్చంద సంస్థ MHIP ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది.

జూలై 9 (గురువారం) - మేఘాలయలో బేహ్‌ దైన్‌ఖ్లామ్‌ పండగ సందర్భంగా సెలవు. ఇది స్థానిక ప్నార్ (జైంటియా) గిరిజన తెగ జరుపుకునే పండగ.

జూలై 16 (గురువారం) - ఒడిషా, ఉత్తరాఖండ్, మణిపూర్ లో రథయాత్ర సందర్భంగా బ్యాంకులకు సెలవు

జూలై 17 (శుక్రవారం) - మేఘాలయాలో యు టిరోట్ సింగ్ వర్ధంతి సందర్భంగా ప్రత్యేక సెలవు ఉంది.

జూలై 18 (శనివారం) - సిక్కింలో ద్రుక్పా షి-జి అనే బుద్దిస్ట్ ఫెస్టివల్ సందర్భంగా సెలవు.

జూలై 22 (బుధవారం) - ఖార్చి పూజా సందర్భంగా త్రిపురలో సెలవు... దీన్ని అగర్తలో ఘనంగా జరుపుకుంటారు.

45
జూలైలో బ్యాంకులకు మొత్తం సెలవులెన్ని?

ఒక్కో రాష్ట్రంలో బ్యాంక్ హాలిడేస్ ఒక్కోలా ఉన్నాయి... కానీ రిజర్వ్ బ్యాంక్ ఇండియా ప్రకారం మొత్తం 12 రోజులు బ్యాంకులకు సెలవులు రానున్నాయి. ఇందులో ఆరు రోజులు దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవులు అయితే ఇంకో ఆరురోజులు వివిధ రాష్ట్రాల్లో వచ్చే ప్రత్యేక సెలవులు. అయితే తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం బ్యాంకులకు ప్రత్యేక సెలవులేమీ లేవు... కేవలం రెండు శనివారాలు, నాలుగు ఆదివారాలు కలిపి మొత్తం ఆరు సెలవులు మాత్రమే ఉన్నాయి.

55
బ్యాంకులకు సెలవున్నా ఆర్థిక కష్టాలుండవు.. ఎందుకో తెలుసా?

బ్యాంకులు మూసి ఉన్నప్పటికీ చాలా డిజిటల్ సేవలు యథావిధిగా పనిచేస్తాయి. ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ, ఏటీఎం లావాదేవీలు, బిల్లు చెల్లింపులు, బ్యాలెన్స్ చెకింగ్ వంటి సేవలను ఎలాంటి ఆటంకం లేకుండా వాడుకోవచ్చు. కాబట్టి రోజువారీ లావాదేవీలకు పెద్దగా ఇబ్బంది ఉండదు. కానీ చెక్ డిపాజిట్, లోన్స్ పనులు, లాకర్ పనులు ఉన్నవారికి మాత్రం బ్యాంకు సెలవులతో కాస్త ఇబ్బంది ఉంటుంది... కాబట్టి కేవలం బ్యాంకులకు వెళితే తప్ప పనికాదు అనుకునేవారు జూలై సెలవులను దృష్టిలో పెట్టుకుని పనులు ప్లాన్ చేసుకుంటే మంచిది... సమయం ఆదా అవ్వడమే కాదు పనులు కూడా ఆటంకం లేకుండా జరిగిపోతాయి.

Read more Photos on
click me!

Recommended Stories