Gold Rate: బంగారం ధర ఎంతో తెలిస్తే ఆనందంతో ఊగిపోతారు... తులం ఏకంగా రూ. 3000 పడిపోయిందా..ఇక పండగే..

First Published | Aug 9, 2023, 11:42 AM IST

బంగారం ధరలు గత కొన్ని రోజులుగా తగ్గుతున్నాయి. దీంతో పసిడి ప్రియులు పండుగ చేసుకుంటున్నారు గతంలో 63000 వరకు ఎగిసిన బంగారం ధర ప్రస్తుతం 60 వేల వద్ద ట్రేడ్ అవుతోంది. భవిష్యత్తులో మరింత తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

బంగారం ధరలు మార్కెట్లో బుధవారం భారీగా తగ్గుముఖం పడ్డాయి.  గడచిన వారం రోజులుగా బంగారం ధరలు తగ్గుతూనే ఉన్నాయి. . ముఖ్యంగా అమెరికా ఫ్రెంట్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచినప్పటి నుంచి కూడా పసిడి ధరలో తగ్గుముఖం పడుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో పసిడి  కొనుగోలు చేసే వారికి ఇది ఒక రకంగా గుడ్ న్యూస్ అనే చెప్పాలి.  దేశీయంగా గమనించినట్లయితే ప్రస్తుతం బంగారం  24 క్యారెట్ల 10 గ్రాముల ధర 60,060 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది.  మంగళవారం ఈ ధర 60160 రూపాయల వద్ద ట్రేడ్ అయింది.

ఈరోజు అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర తగ్గుముఖం పట్టగా, వెండి ధర బూమ్‌తో ట్రేడవుతోంది. అమెరికా మార్కెట్‌లో ఔన్సు బంగారం ధర 3.10 డాలర్లు తగ్గి 1,933.70 డాలర్ల వద్ద, వెండి ఔన్స్‌కు 0.04 డాలర్లు తగ్గి 23.16 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
 


బంగారం, వెండి రెండూ మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో క్షీణతతో ట్రేడవుతున్నాయి. ఎంసీఎక్స్‌లో బంగారం ధర 10 గ్రాములకు రూ.11 తగ్గి రూ.59,409 వద్ద ఉండగా, వెండి కిలో రూ.69 తగ్గి రూ.71,199 వద్ద ట్రేడవుతోంది.

మరోవైపు అంతర్జాతీయంగా పసిడి ధరలు తగ్గుముఖం పట్టడంతో దేశీయంగా కూడా బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి ప్రధానంగా హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు గడచిన నెల రోజుల్లో భారీగా . తగ్గుముఖం పట్టాయి.  బంగారం ధరలు ప్రస్తుతం హైదరాబాదులో 60 వేల వద్ద ట్రేడ్ అవుతోంది. 

 ప్రస్తుతం రాబోయే శ్రావణమాసంలో బంగారం డిమాండ్ పుంజుకునే అవకాశం ఉంది.  శ్రావణ మాసంలో పెళ్లిళ్లు  పెద్ద ఎత్తున జరిగే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో బంగారం కొనుగోలు చేసే వారికి తగ్గుతున్న ధరలు ఆనందం తెప్పించే అవకాశం ఉంది.  దాంతోపాటు నగల వ్యాపారులు కూడా తగ్గిన బంగారం ధరల నేపథ్యంలో కస్టమర్లు పెరిగే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. 

ఇదిలా ఉంటే అంతర్జాతీయంగా పరిణామాలను గమనించినట్లయితే ప్రస్తుతం డాలర్ ధర  మరింత పుంజుకునే అవకాశం ఉంది.  ఈ నేపథ్యంలో అంతర్జాతీయంగా పెట్టుబడులు అన్నీ కూడా అమెరికా బాండ్ మార్కెట్లో తరలి వెళ్లే అవకాశం ఉంది.  ఫలితంగా బంగారం ధరలు మరింత తగ్గి వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.  బంగారం ధర తగ్గినప్పుడల్లా  కొనుగోలు చేసుకోవాలని  నిపుణులు సూచిస్తున్నారు.  

Latest Videos

click me!