ఒక్కోసారి సిబిల్ స్కోర్ 600 కన్నా తగ్గిపోతే ఇక రుణం పొందడం అనేది దాదాపు అసాధ్యం అనే చెప్పవచ్చు. అయితే రుణం పొందేందుకు సిబిల్ స్కోర్ తప్పనిసరి అనుకోవడం పొరపాటే. చాలా బ్యాంకులు సెక్యూర్డ్ రుణాల పేరిట కూడా. రుణాలను అందిస్తున్నాయి. ముఖ్యంగా బంగారం తనకా పెట్టడం, మీ ఆస్తులు తనఖా పెట్టడం ద్వారా కూడా రుణం పొందడం చాలా సులువైన పద్ధతి అని చెప్పవచ్చు. బ్యాంకులు మీ ఇంటి పత్రాలను సెక్యూరిటీగా పెట్టుకొని రుణం అందిస్తాయి. అలాగే బంగారం రుణాలపై కూడా బంగారం తనఖా పెట్టుకొని లోన్ ఇస్తాయి.