ప్రపంచ ఆర్థిక అస్థిరత కారణంగా భారతదేశంలో బంగారం ధర భారీగా పెరుగుతోంది. ముఖ్యంగా అక్షయ తృతీయ దగ్గరపడుతోంది. ఈ సమయంలో కనీసం గ్రాము బంగారం అయినా కొనాలని చాలా మంది భారతీయులు అనుకుంటూ ఉంటారు. కానీ, వారి ఆశలకు బంగారం ధర కల్లెం వేస్తోంది. రోజు రోజుకీ ధర ఆకాశాన్ని అంటుంది. తాజాగా ఒక్క రోజులోనే భారీగా పెరిగింది. మరి, ఇప్పుడు ధర ఎంత పెరిగింది..? ఎంతకు చేరుకునే అవకాశం ఉంది అనే విషయాలు తెలుసుకుందాం..
ఇప్పటికే బంగారం ధర రూ.లక్షకు చేరువలో ఉంది. మరి కొద్దిరోజుల్లో అది రూ.1.25 లక్షల దాకా కూడా వెళ్లే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే సామాన్యుల బంగారం కొనాలనే కోరిక ఎప్పటికీ కోరికగానే మిగిలిపోతుంది.
బంగారం ధర పెరుగుదలకు కారణం
గత ఐదు సంవత్సరాల్లో, బంగారం ధర 110% కంటే ఎక్కువ పెరిగింది. ఇది ఏప్రిల్ 2020లో 10 గ్రాములకు రూ.44,906గా ఉండగా, ఏప్రిల్ 2025లో రూ.95,239కి చేరుకుంది. వాణిజ్య వివాదాలు,అమెరికా మాంద్యం ముప్పు వంటి అనేక ప్రపంచ ఆర్థిక కారకాల వల్ల ఈ ధర పెరుగుదలకు కారణమని నిపుణులు చెబుతున్నారు.
Gold Shop
నిరంతరం పెరుగుతున్న బంగారం ధర
అంతర్జాతీయ బంగారం ధర ఔన్స్‌కు $3,700కి చేరుకుంటుందని, వాణిజ్య ఉద్రిక్తతలు మరింత పెరిగితే $4,500కి చేరుకుంటుందని గోల్డ్‌మన్ సాచ్స్ అంచనా వేసింది. ఈ ప్రపంచ ధోరణి భారతదేశంలో దేశీయ బంగారం ధరను రూ.1 లక్ష నుండి రూ.1.25 లక్షల వరకు పెంచే అవకాశం ఉంది.
Gold
నేడు హైదరాబాద్ లో బంగారం ధరలు..
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.700 పెరిగి తొలిసారిగా రూ.90,150 కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.770 పెరిగి రూ.98,350 వద్ద కొనసాగుతోంది. ఇక.. బంగారంతో పాటు వెండి కూడా పోటీ పడుతోంది. కేజీ వెండి రూ.1000 పెరగడంతో రూ.1,11,000 కి చేరుకుంది.