భారతదేశంలో బంగారం కొనాలనుకునే వారికి ఇది నిజంగా బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభం అంటే ఏప్రిల్ 1 నుంచి బంగారం ధర రికార్డు స్థాయిలో పెరుగుతూ వస్తోంది. భారతదేశంలో బంగారం ధరలు గురువారం కూడా రికార్డు స్థాయిలో పెరిగాయి. దేశ రాజధాని డిల్లీలోని బులియన్ మార్కెట్‌లో బంగారం ధర 10 గ్రాములకు రూ.280 పెరిగి రూ.60,680కి చేరింది. గత ట్రేడింగ్ సెషన్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.60,400 వద్ద ముగిసింది.