ప్రస్తుతం మార్కెట్లో పలు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు సైతం బంగారు రుణాలను అందిస్తున్నాయి. అతి తక్కువ డాక్యుమెంటేషన్ తో, కేవలం నిమిషాల వ్యవధిలోనే బంగారం రుణాలను అందిస్తున్నాయి. బంగారం మార్కెట్ విలువలో సుమారు 75 శాతం వరకు మీకు నగదు రూపంలో రుణం లభిస్తుంది అత్యవసర సమయంలో ఈ రుణం మీకు ఎంతో ఉపయోగపడుతుంది. ప్రస్తుతం బంగారం ధర భారీగా పెరుగుతున్న నేపథ్యంలో మీకు ఎక్కువ మొత్తంలో రుణం లభించే అవకాశం ఉంది.