Gold Rate: బంగారం ధర రూ. 62 వేలు దాటింది..ఈ టైంలో బంగారం కొనొచ్చా...త్వరలోనే బంగారం లక్ష దాటుతోందా..?

Published : Apr 12, 2023, 03:26 PM IST

చూస్తుండగానే గడచిన 45 రోజుల్లో బంగారం ధర ఏకంగా 55000 నుంచి 62,000 కు చేరింది.  ప్రస్తుతం బంగారం ధర ఆల్ టైం గరిష్ట స్థాయి వద్ద ఉంది.  ఈ రికార్డు స్థాయి వద్ద బంగారం కొనుగోలు చేయడం కరెక్టేనా.  భవిష్యత్తులో బంగారం ధర తగ్గుతుందా లేక మరింత పెరుగుతుందా అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.   

PREV
15
Gold Rate: బంగారం ధర రూ. 62 వేలు దాటింది..ఈ టైంలో బంగారం కొనొచ్చా...త్వరలోనే బంగారం లక్ష దాటుతోందా..?

బంగారం ధర గడచిన ఐదేళ్లుగా మనం గమనించినట్లయితే, అంటే 2018 నుంచి 2023 వరకు చూసినట్లయితే దాదాపు డబుల్ అయింది.  2018లో 10 గ్రాముల  మేలిమి బంగారం ధర  31 వేల రూపాయలు ఉంది.  ప్రస్తుతం 2023లో 10 గ్రాముల మేలిమి బంగారం ధర 62 వేలకు చేరింది అంటే ఈ ఐదు సంవత్సరాల్లో బంగారం ధర రెండింతలు అయింది 2020లో కరోనా సమయంలో బంగారం ధర తొలిసారిగా 56 వేల మార్పును టచ్ చేసింది.  అప్పటినుంచి బంగారం ధర స్వల్పంగా దిగివస్తూ 2022లో 52000 సమీపంలో స్థిరపడింది కానీ 2023 ప్రారంభం నుంచి బంగారం ధర వరుసగా పెరగటం ప్రారంభించింది ప్రస్తుతం బంగారం ధర ఏకంగా 62 వేల రూపాయలు దాటిపోయింది. 
 

25

గడచిన 45 రోజులుగా మనం గమనించినట్లయితే బంగారం ధర ఏకంగా 7000 రూపాయలు పెరిగింది.  మార్చి ప్రారంభంలో బంగారం ధర 54 వేల వద్ద ఉంది. మరి భవిష్యత్తులో కూడా బంగారం ధర పెరిగే ఛాన్స్ ఉందా అంటే పుష్కలంగా ఉందని అందుకు సంకేతాలు కూడా కనిపిస్తున్నాయని బంగారు మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.  ఇందుకు కారణాలు లేకపోలేదు అంతర్జాతీయంగా కూడా బంగారం ధర భారీగా పెరిగింది.  అమెరికాలో ఒక ఔన్స్ (31 గ్రాములు ) బంగారం ధర 2000 డాలర్లు దాటింది. 
 

35

అమెరికాలో ప్రారంభమైన బ్యాంకింగ్ సంక్షోభం బంగారం మార్కెట్ ను ప్రభావితం చేస్తుంది. మరోవైపు డాలర్ క్షీణత కూడా బంగారంపై కనిపిస్తోంది. ఫలితంగా ఇన్వెస్టర్లు అమెరికా బాండ్ మార్కెట్ బదులుగా బంగారం ఫ్యూచర్లలో ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఫలితంగా రిటైల్ మార్కెట్లో కూడా బంగారానికి గిరాకీ పెరిగి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. 
 

45

గడచిన 23 సంవత్సరాలుగా  మనం బంగారం ధరలను గమనించినట్లయితే, సరిగ్గా 2000 సంవత్సరంలో 10 గ్రాముల మేలిమి బంగారం ధర 4400గా ఉంది.  అక్కడి నుంచి సరిగ్గా 2010 నాటికి అంటే పది సంవత్సరాల్లో బంగారం ధర 18,500 కు చేరింది. అంటే నాలుగు రెట్లు పెరిగింది. అనంతరం బంగారం ధర 2020 నాటికి  50 వేలకు చేరింది. అంటే దాదాపు మూడింతలు పెరిగింది.  ఈ లెక్కన చూసినట్లయితే 2025 నాటికి బంగారం ధర ఒక లక్ష రూపాయలు దాటిన ఆశ్చర్యపోనవసరం లేదని బులియన్ మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

55

మరి బంగారం ధర ఈ రేంజ్ లో పెరుగుతూ ఉంటే ప్రస్తుతం బంగారం నగలు కొనుగోలు చేయాలా వద్దా అని మీరు ఆలోచిస్తే మాత్రం,  ప్రతి సంవత్సరం కొద్ది మొత్తంలో మీ ఇన్వెస్ట్మెంట్ లో కొంత భాగం బంగారంపై పెడితే మంచిది. ఎందుకంటే ప్రతి సంవత్సరం బంగారం ధర భారీగా పెరుగుతోంది.. ఉదాహరణకు 2000 సంవత్సరంలో మీరు అప్పటి రేటు ప్రకారం 10 గ్రాములు 4400 చొప్పున రూ. 4.40 లక్షలతో ఒక కేజీ బంగారం కొని ఉంటే,  ఇప్పుడు దాని విలువ దాదాపు 62 లక్షలు దాటి ఉండేది. అంటే బంగారం పై పెట్టుబడి ఏ రేంజ్ లో పెరిగిందో మీరు అర్థం చేసుకోవచ్చు.  ఈ లెక్కన చూస్తే మీ వద్ద  డబ్బు ఉన్నప్పుడు  అందులో కొంత భాగం బంగారంపై పెట్టుబడి పెట్టడం  సరైన  నిర్ణయం అనే తేలుతోంది. 
 

Read more Photos on
click me!

Recommended Stories