బంగారం తగ్గడానికి గల అవకాశాలకు కారణాలు కూడా చెబుతున్నారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం సమస్యగా మారింది. ప్రపంచంలోనే అన్ని దేశాలకు మాంధ్యం దెబ్బ తగిలింది. దీని నుంచి బయటపడేందుకు ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు అయినా అమెరికా, జర్మనీ, ఇటలీ, జపాన్, చైనా, రష్యా తమ అపారమైన బంగారు నిలువల నుంచి కొంత భాగాన్ని మార్కెట్లోకి రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో బంగారం ధర భారీగా తగ్గే అవకాశం ఉంది.