10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం మార్కెట్ ధర రూ. 60,000 వద్ద నడుస్తోంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,000 వద్ద నడుస్తోంది. అయితే మీ పాత బంగారం 22 క్యారెట్లు అయితే, దాని క్వాలిటీ 18 క్యారెట్లు ఉందని మిమ్మల్ని నమ్మిస్తారు. అప్పుడు దాని ధర రూ. 48,000 ఉంటుంది. అంటే, ప్రారంభంలో షాపు వారు రూ. 8,000 ప్రయోజనం పొందుతారు. ఇది కాకుండా, 1 గ్రాము బరువులో కూడా ఏదైనా వస్తే నగల షాపు వారికి అదనంగా, 5,000 వరకూ లాభం వస్తుంది. ఇందులో మేకర్‌కి ఛార్జీ ఉంటుంది, ఇది దాదాపు రూ. 5,000 వరకు వస్తుంది. ఈ మోసం ద్వారా స్వర్ణకారులు 10 వేల రూపాయలు పొందుతున్నారు. పాత బంగారంతో కొత్త ఆభరణాలు ఉచితంగా చేయిస్తానని చాలాసార్లు ఆఫర్ చేస్తుంటారు. అందులో చాలా పెద్ద మోసం ఉంటుందని గమనించండి.