4,429 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న తన విలాసవంతమైన ఇంట్లో 9 బెడ్‌రూమ్‌లు, 5 బాత్‌రూమ్‌లు, కంప్యూటర్ ల్యాబ్, సినిమా థియేటర్, సెలూన్, స్విమ్మింగ్ పూల్, క్రికెట్ ఫీల్డ్ సహా అవసరమైన అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఇంటి ఇంటీరియర్ పూర్తిగా సుందర్ పిచాయ్ భార్య డిజైన్ చేశారు.. ఇంటీరియర్ ఖర్చు రూ.49 కోట్లు అని సమాచారం. ఈ విలాసవంతమైన ఇంటిలో స్విమ్మింగ్ పూల్, ఇన్ఫినిటీ పూల్, జిమ్నాజియం, స్పా, వైన్ సెల్లార్, సోలార్ ప్యానెల్లు, ఎలివేటర్లు నానీ క్వార్టర్స్ వంటి వివిధ ఆధునిక వినోద సౌకర్యాలు ఉన్నాయి.