24K, 22K, 18K బంగారం మధ్య వ్యత్యాసాన్ని అర్థం చేసుకోండి.
24 క్యారెట్ బంగారం అంటే స్వచ్ఛమైన బంగారం ఇందులో ఏ ఇతర లోహ మిశ్రమం కలవదు. స్థానిక మార్కెట్‌లో, ఇది 99.9 శాతం స్వచ్ఛమైనదిగా గుర్తిస్తారు. ఇది చూసేందుకు ప్రత్యేకంగా ప్రకాశవంతమైన పసుపు రంగును కలిగి ఉంటుంది. 24 క్యారెట్ల బంగారం. మృదువుగా, తేలికగా ఉంటుంది. దీన్ని సాధారణ ఆభరణాల తయారీలో ఉపయోగించరు. 24 క్యారెట్ బంగారాన్ని నాణేలు, గోల్డ్ బార్లు తయారు చేయడానికి ఉపయోగిస్తారు.