మల్టీ-కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో ఉదయం 9.31 గంటలకు 10 గ్రాముల గోల్డ్ కాంట్రాక్టులు 0.29 శాతం పెరిగి రూ. 47,541 కి చేరాయి. డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ 0.39 శాతం పెరిగి కిలోకు రూ. 65,269 కి చేరాయి.
అంతర్జాతీయ మార్కెట్‌లో బలహీనమైన డాలర్‌తో పోలిస్తే బంగారం ధరలు పెరిగాయి. ఒక నివేదిక ప్రకారం స్పాట్ గోల్డ్ 0.1 శాతం పెరిగి ఔన్స్‌కు 1,785.00 డాలర్లు, యుఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.2 శాతం పెరిగి 1,786.00 డాలర్లకు చేరుకుంది. గత 15 రోజుల్లో 24 క్యారెట్ల పసిడి ధర సుమారు వెయ్యి పెరగగా, 22 క్యారెట్ల పసిడి ధర రూ.700 వరకు పెరిగింది.