Gold Prices: తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు పెరిగాయి: తాజా ధరలు ఎంతున్నాయంటే..

Naga Surya Phani Kumar | Published : May 11, 2025 2:25 PM
Google News Follow Us

Gold Prices: బంగారం ధరలు ఒక్కో రోజు ఒక్కోలా ఉంటున్నాయి. మే 11న రెండు తెలుగు రాష్ట్రాల్లో వివిధ నగరాల్లో ఉన్న బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

15
Gold Prices: తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు పెరిగాయి: తాజా ధరలు ఎంతున్నాయంటే..

రెండు తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన బంగారం ధరలు

11 మే 2025 రోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం ధరలు పెరిగాయి. హైదరాబాద్, విజయవాడ వంటి ప్రధాన నగరాల్లో 22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం ధరలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. 

 

25

హైదరాబాద్ లో ధరలు

తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర రూ.9,045 కాగా, 24 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర రూ.9,868గా ఉంది. ఇది గతంలో పోలిస్తే కాస్త ఎక్కువగానే ఉంది. 

 

35

విజయవాడలో ధరలు 

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఉన్న విజయవాడలో 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర రూ.9,045 కాగా, 24 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర రూ.9,868 గా ఉంది. 

అదేవిధంగా గుంటూరు నగరంలో కూడా బంగారం ధరలు పెరిగాయి. అక్కడ 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.89,621 కాగా, 24 క్యారెట్ల బంగారం రూ.97,281 గా ఉంది.

 

45

తెలుగు రాష్ట్రాల్లో ధరల పెరుగుదలకు కారణం ఇదే..

ఈ ధరల పెరుగుదలకు అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం డిమాండ్ పెరిగింది. రూపాయి మారకం విలువలో మార్పులు వచ్చాయి. స్థానిక మార్కెట్ పరిస్థితులు కూడా బంగారం ధరలను ప్రభావింతం చేశాయి. 

వెండి ధరలు కూడా పెరిగాయి..

గత వారంతో పోలిస్తే మార్కెట్ లో వెండి ధరలు సుమారు రూ.1,000 వరకు పెరిగింది. మే 11న వెండి ధర కిలో రూ.99,000 వేలుగా ఉంది.

55

గమనిక

బంగారం కొనుగోలు చేసే ముందు తాజా ధరలను పరిశీలించడం, నాణ్యతా ప్రమాణాలు (BIS హాల్‌మార్క్) ఉన్న బంగారాన్ని కొనుగోలు చేయడం మంచిది. మరిన్ని వివరాలకు, ఇతర నగరాల్లో బంగారం ధరల కోసం సంబంధిత వెబ్‌సైట్లను సందర్శించండి.

 

Read more Photos on
Recommended Photos