Today Gold Rate: గందరగోళంలో బంగారం ధరలు.. ఇన్వెస్టర్లకు చుక్కలే..

Published : May 02, 2026, 11:35 AM IST

Today Gold Rate: వారం రోజులుగా బంగారం ధరలు అనిశ్చితంగా ఉన్నాయి. ఉదయం పెరిగిన ధరలు సాయంత్రానికి పడిపోవడం, మరుసటి రోజు మళ్లీ పెరగడం వంటి మార్పులు ఇన్వెస్టర్లను అయోమయానికి గురిచేస్తున్నాయి. అర్థం కాక కొనుగోలుదారులు కూడా కాస్త వెనకడుగు వేస్తున్నారు.

PREV
15
అనిశ్చితంగా ఉన్న గోల్డ్, సిల్వర్

ఇటీవల రోజుల్లో జరిగిన మార్పులను గమనిస్తే అస్థిరత స్పష్టంగా కనిపిస్తుంది. ఏప్రిల్ 28న బంగారం ధర భారీగా రూ.2780, ఏప్రిల్ 30న మళ్లీ రూ.2290 పెరిగింది. అయితే మే 1న మరోసారి రూ.2130 తగ్గింది. ఇలా వరుసగా పెరుగుదలలు, తగ్గుదలలు చోటుచేసుకోవడం మార్కెట్‌లో అనిశ్చితిని పెంచుతోంది. 

25
24 క్యారెట్ల మేలిమి బంగారంపై రూ.330 పెరిగిన ధరలు

ఇవాళ్టి తాజా ధరల విషయానికి వస్తే, దేశీయ మార్కెట్‌లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ బంగారం 10 గ్రాముల ధర రూ.330 పెరిగి రూ.1,50,930కు చేరుకుంది. 22 క్యారెట్ బంగారం ధర రూ.300 పెరిగి రూ.1,38,350 వద్ద ట్రేడవుతోంది. అలాగే 18 క్యారెట్ బంగారం ధర రూ.250 పెరిగి రూ.1,13,200కు చేరింది.

35
ఊగిసలాటలో బంగారం, వెండి

వెండి ధరలు కూడా గణనీయంగా మారాయి. మే 1న కిలో వెండి రూ.5వేలు పడిపోయినప్పటికీ, ఇవాళ అదే స్థాయిలో మళ్లీ పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2,70,000గా ఉంది. అంటే తులం వెండి సుమారు రూ.2700కు లభిస్తోంది.

ఈ ధరల ఊగిసలాటకు ప్రధాన కారణాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక, రాజకీయ పరిస్థితులే. ముఖ్యంగా మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు, ఆయిల్ ధరల మార్పులు, సెంట్రల్ బ్యాంకుల వడ్డీ రేట్లపై నిర్ణయాలు అన్నీ కలిసి గోల్డ్ మార్కెట్‌ను ప్రభావితం చేస్తున్నాయి. 

45
ఇరాన్ కొత్త ప్రతిపాదనతో పరిస్థితుల్లో మార్పు

ఇటీవల ఇరాన్ నుంచి వచ్చిన కొత్త ప్రతిపాదనతో పరిస్థితుల్లో మార్పు కనిపిస్తోంది. యుద్ధం తగ్గే అవకాశాలు ఉన్నాయనే సంకేతాలు రావడంతో ఇన్ఫ్లేషన్‌పై ఉన్న ఆందోళనలు కొంత తగ్గాయి. యుఎస్‌తో ఒప్పందం కుదిరే అవకాశం ఉందనే వార్తలు మార్కెట్‌లో పాజిటివ్ భావనను పెంచాయి.

ఫిబ్రవరి చివర్లో ప్రారంభమైన యుద్ధం తర్వాత గోల్డ్ ధరలు దాదాపు 12 శాతం వరకు పడిపోయాయి. హోర్ముజ్ స్ట్రైట్ సమస్యలు, చమురు ధరల పెరుగుదల కారణంగా వడ్డీ రేట్లు తగ్గే అవకాశాలు కూడా తగ్గాయి. 

55
గోల్డ్‌పై పాజిటివ్ సెంటిమెంట్

అయితే ఇప్పుడు యుద్ధం శాంతించడంతో మళ్లీ గోల్డ్‌పై పాజిటివ్ సెంటిమెంట్ పెరుగుతోంది. మరోవైపు, సెంట్రల్ బ్యాంకులు గోల్డ్ కొనుగోళ్లు కొనసాగిస్తుండటం కూడా ధరలకు మద్దతుగా నిలుస్తోంది. గోల్డ్ నిల్వలు గత ఏడాదితో పోలిస్తే మరింత వేగంగా పెరుగుతున్నాయి. ధరలు ఎప్పుడైనా మారే అవకాశం ఉన్నందున కొనుగోలు లేదా పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories