Gold Price Hike: పసిడి రేట్లు మళ్లీ దూకుడు.. గంటల్లోనే మారిన మార్కెట్.. కొనాలా? ఆగాలా?

Published : Sep 10, 2026, 12:02 PM IST

Gold Price Hike: బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. కొద్ది రోజులుగా తగ్గుతూ వచ్చిన పసిడి రేట్లకు ఇప్పుడు బ్రేక్ పడింది. 24 క్యారెట్ల బంగారం ధర ఒక్కరోజులోనే రూ.1,200 పెరగడంతో కొనుగోలుదారుల్లో ఆందోళన మొదలైంది. మరోవైపు వెండి ధర కూడా భారీగా ఎగబాకింది.

PREV
14
పసిడి సీన్ రివర్స్

ఇటీవల కొద్దిరోజులుగా బంగారం ధరలు తగ్గుముఖం పట్టడంతో కొనుగోలుదారులకు కొంత ఊరట లభించింది. అయితే ఇప్పుడు ఒక్కసారిగా రేట్లు పైకి ఎగబాకడంతో ఆ పరిస్థితి మారిపోయింది. ముఖ్యంగా ఒకే రోజులో వెయ్యి రూపాయలకు పైగా పెరగడం పసిడి కొనుగోలుదారులకు భారంగా మారుతోంది. పెళ్లిళ్లు, శుభకార్యాలు లేదా పెట్టుబడి కోసం బంగారం కొనాలని చూస్తున్నవారు తదుపరి రోజుల్లో ధరలు ఎలా ఉంటాయనే దానిపై ఆసక్తిగా ఉన్నారు.

24
రూ.1,55,510గా చేరిన బంగారం

దేశీయ బులియన్ మార్కెట్లో ప్రస్తుతం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,55,510గా ఉంది. హైదరాబాద్‌లో కూడా ఇదే రేటు కొనసాగుతోంది. నిన్నటితో పోలిస్తే ఇవాళ పసిడి ధర ఏకంగా రూ.1,200 పెరిగింది. ఇక 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.1,42,550 పలుకుతోంది. ఈ ధర కూడా ఒక్కరోజులో రూ.1,100 పెరిగింది. విజయవాడ, విశాఖపట్నంలోనూ ఇదే స్థాయిలో బంగారం ధరలు కొనసాగుతున్నాయి.

వెండి మార్కెట్‌లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఢిల్లీలో కిలో వెండి ధర ప్రస్తుతం రూ.2.55 లక్షలుగా ఉంది. నిన్న కిలో వెండి రూ.2.50 లక్షల వద్ద ఉండగా.. ఇవాళ రూ.5,000 పెరిగింది. హైదరాబాద్‌లో కూడా కిలో సిల్వర్ రూ.2.55 లక్షల వద్ద ఉంది. చెన్నై, బెంగళూరులోనూ దాదాపు ఇదే ధర కొనసాగుతోంది.

34
అమెరికా, ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు

ఇక బంగారం ధరల పెరుగుదల వెనుక అంతర్జాతీయ పరిణామాలు కీలకంగా మారాయి. పశ్చిమాసియాలో అమెరికా, ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు ఇంకా పూర్తిగా సద్దుమణగలేదు. ఈ పరిస్థితులతో ప్రపంచ మార్కెట్లలో అనిశ్చితి పెరుగుతోంది. దీంతో ఇన్వెస్టర్లు రిస్క్ ఉన్న పెట్టుబడుల నుంచి సురక్షిత ఆస్తుల వైపు మళ్లుతున్నారు. ఈ క్రమంలో బంగారానికి డిమాండ్ పెరుగుతోంది.

44
ఈ పెరుగుదల ఇక్కడితో ఆగుతుందా?

మరోవైపు డాలర్ విలువ బలహీనపడటం కూడా పసిడి ధరలకు రెక్కలొచ్చాయి. దీనికి తోడు క్రూడ్ ఆయిల్ ధరలు మళ్లీ పెరిగి బ్యారెల్‌కు 100 డాలర్ల మార్క్‌ను దాటాయి. చమురు ధరలు పెరగడంతో ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణంపై ఆందోళనలు పెరుగుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో బంగారంపై పెట్టుబడిదారుల ఆసక్తి మరింత పెరుగుతోందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

మరి ఈ పెరుగుదల ఇక్కడితో ఆగుతుందా? లేక అంతర్జాతీయ పరిస్థితులు ఇలాగే కొనసాగితే బంగారం ధరలు మరింత పైకి వెళ్తాయా? అనేది ఇప్పుడు కీలకంగా మారింది. రాబోయే రోజుల్లో పశ్చిమాసియా పరిస్థితులు, డాలర్ కదలికలు, క్రూడ్ ఆయిల్ ధరలు పసిడి తదుపరి ట్రెండ్‌ను నిర్ణయించే అవకాశం ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories