హైదరాబాద్‌లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..
24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.2,510 తగ్గి రూ.1,50,170కి చేరింది. ఇక ఆభరణాల తయారీలో ఎక్కువగా ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై రూ.2,300 తగ్గింది. దీంతో 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,37,650 వద్ద కొనసాగుతోంది.
వెండి కూడా పసిడి బాటలోనే భారీగా పడిపోయింది. కిలో వెండిపై రూ.5,000 తగ్గడంతో ప్రస్తుతం రూ.2,45,000 వద్ద ఉంది.
అయితే బులియన్ మార్కెట్‌లోని ధరలు నగరం, స్థానిక మార్కెట్, జ్యువెలరీ షాపును బట్టి స్వల్పంగా మారే అవకాశం ఉంటుంది. అలాగే ఆభరణాలు కొనుగోలు చేసేటప్పుడు మేకింగ్ ఛార్జీలు, జీఎస్టీ వంటివి అదనంగా ఉండొచ్చు.