Today Gold Rate: టర్కీ నిర్ణయానికి బంగారం మార్కెట్లు కుదేలు...పసిడి ప్రియులకు మాత్రం పండగే

Published : Mar 30, 2026, 11:07 AM IST

Today Gold Rate: బంగారం మార్కెట్లు మళ్లీ కుప్పకూలుతున్నాయి. ఓ దేశం తీసుకున్న నిర్ణయం, అంతర్జాతీయ పరిస్థితులు....పసిడిపై ప్రభావం చూపుతోంది. ఇంతకీ ఆ దేశం తీసుకున్న డెసిషన్ ఏంటంటే... 

PREV
15
పసిడి ప్రియులకు పండగే

హమ్మయ్యా ఈరోజు బంగారం విషయంలో సేఫ్. ఎందుకంటే మళ్లీ ధరలు కుదేలయ్యాయి. ఈ గుడ్ న్యూస్‍తో పసిడి ప్రియులకు పండగే. ఈ మధ్య కాలంలో పసిడి రేట్లు రూ.1,40,000 దగ్గర్లోనే ఉన్నాయి. అక్కడి నుంచి ఊగిసలాడుతున్నాయి. సో ఈ గ్రాఫ్ చూసుకుంటే కొనుగోలుదారులకు ఊరట దొరికిందనే చెప్పుకోవాలి. ముఖ్యంగా పెళ్లిళ్లు, శుభకార్యాలు పెట్టుకున్నవారికి ఉపశమనం లభించింది. 

ఉగాది తర్వాత కూడా బంగారం తగ్గినట్లే తగ్గి మధ్యలో పెరగడం ప్రారంభించింది. దానికి కారణం ట్రంప్ నిర్ణయం. శాంతి చర్చలకు పిలుపునివ్వడంతో బంగారం ధరలు పెరిగాయి. అయితే సడెన్‍గా యుద్ధానికి సిద్ధమైంది అమెరికా. దీంతో మళ్లీ యుద్ధ వాతావరణం వేడెక్కడంతో పసిడి తగ్గడం మొదలెట్టింది.

25
రూ.1,47,280కి చేరిన బంగారం ధర

అయితే ప్రస్తుతం ఈరోజు కూడా బంగారం ధర తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల పసిడిపై 10 గ్రాములకు రూ.810 తగ్గి రూ.1,47,280కి చేరింది. 22 క్యారెట్ల క్యారెట్ల 10 గ్రాముల పుత్తడిపై రూ.750 పెరిగి రూ.1,35,000కు ఎగబాకింది. వెండిపై ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా ఉంది. ప్రస్తుతం కిలో వెండి మార్కెట్లో రూ.2.50లక్షలుంది. 

35
ప్రపంచాన్ని షేక్ చేస్తున్న టర్కీ నిర్ణయం

గత కొన్నిరోజులుగా పసిడి, సిల్వర్ రేట్లు...అయోమయానికి గురిచేస్తున్నాయి. ఓరోజు తగ్గుతూనే మళ్లీ ఆకాశానికి ఎగబాకుతున్నాయి. దీంతో ఇటు ఇన్వెస్టర్లు, అటు కొనుగోలుదారులు..కంగారుపడుతున్నారు.అయితే గల్ఫ్ దేశమైన టర్కీ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ప్రపంచాన్నే షేక్ చేస్తోంది. ఆ దేశం పెద్ద మొత్తంలో బంగారం అమ్మడం మొదలుపెట్టింది. కేవలం 14 రోజుల్లోనే 58 టన్నుల బంగారం అమ్మి 8 బిలియన్ డాలర్లను సమీకరించింది. దీంతో గ్లోబల్ గోల్డ్ మార్కెట్‍పై భారీ ప్రభావాన్ని చూపుతోంది. 

45
టర్నీ తీసుకున్న నిర్ణయానికి కారణమేంటంటే...

టర్నీ తీసుకున్న నిర్ణయానికి కారణమేంటంటే...డాలర్ మార్పు. ఇరాన్‍ ఉద్రిక్తతల కారణంగా డాలర్ బలపడింది. దీంతో టర్కీ కరెన్సీ లీరా కుదేలైంది. చమురు డిమాండ్ కూడా పెరిగింది. సో ఈ పరిస్థితుల్లో టర్కీ బంగారం అమ్మి డాలర్లను పోగుచేసుకుంటోంది. అయితే బంగారం పడిపోవడానికి టర్కీ ఒక్కటే కారణం కాదు..ప్రపంచవ్యాప్తంగా డాలర్ బలం, యుద్ధ వాతావరణం, పెట్టుబడిదారులు గోల్డ్ నుంచి ఇతర ఆస్తుల వైపు మళ్లడం అంశాలు కూడా ప్రభావం చూపుతున్నాయి. 

55
దీర్ఘకాలంలో మళ్లీ పెరిగే అవకాశాలు

మరోవైపు ధరలు ఇంకా తగ్గే అవకాశం ఉన్నప్పటికీ, దీర్ఘకాలంలో మళ్లీ పెరిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు. ముఖ్యంగా అంతర్జాతీయ ఉద్రిక్తతలు తగ్గి, డాలర్ బలహీనమైతే గోల్డ్ ధరలు ఎగబాకే అవకాశం ఉంది. అందుకే మార్కెట్లు గమనిస్తూ ముందుకెళ్లడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories