Gold Crash: బంగారం కొనే వారికి గుడ్ న్యూస్.. ఒక్కరోజే రూ.2,070 తగ్గిన పసిడి!

Published : Sep 02, 2026, 11:36 AM IST

Gold Crash: బంగారం ధరలు భారీగా పడిపోయాయి. మూడు రోజుల్లోనే తులం పసిడిపై రూ.6,220 తగ్గింది. ప్రస్తుతం రూ.1.52 లక్షల వద్దకు వచ్చిన బంగారం.. ఇక్కడితో ఆగుతుందా? లేక మళ్లీ రూ.1.70 లక్షల దిశగా పరుగులు పెడుతుందా? రాబోయే రోజుల్లో ధరలు ఎలా ఉండబోతున్నాయి?.

PREV
15
కుప్పకూలిన బంగారం

బంగారం ధరల్లో వరుసగా రెండో రోజు కూడా భారీ తగ్గుదల నమోదైంది. గత కొద్దిరోజులుగా భారీగా పెరిగిన పసిడి రేట్లు ఒక్కసారిగా దిగిరావడంతో కొనుగోలుదారులకు కొంత ఊరట లభించింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,070 తగ్గి రూ.1,52,020కి చేరింది. కేవలం మూడు రోజుల్లోనే తులం ప్యూర్ గోల్డ్‌పై రూ.6,220 వరకు తగ్గింది.

25
డాలర్ విలువలో హెచ్చుతగ్గులు

అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా భారీగా తగ్గింది. 10 గ్రాములపై రూ.1,900 తగ్గడంతో ప్రస్తుతం రూ.1,39,350 వద్ద ఉంది. అంతర్జాతీయ మార్కెట్లలో మారుతున్న పరిస్థితులు, డాలర్ విలువలో హెచ్చుతగ్గులు, పెట్టుబడిదారుల సెంటిమెంట్ వంటి అంశాలు దేశీయ బంగారం ధరలపై ప్రభావం చూపుతున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లకు సంబంధించిన అంచనాలు కూడా మార్కెట్ కదలికలకు కారణమవుతున్నాయి.

35
మార్కెట్ నిపుణుల భిన్నాభిప్రాయాలు

అయితే బంగారం ధరలు ఇక్కడితోనే తగ్గుతాయా లేదా మళ్లీ పెరుగుతాయా అన్నదానిపై మార్కెట్ నిపుణులు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. వెండితో పోలిస్తే బంగారానికి ప్రస్తుతం బలమైన డిమాండ్ ఉంది. ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు తమ నిల్వలను పెంచుకునేందుకు పెద్ద మొత్తంలో బంగారం కొనుగోలు చేస్తుండటం పసిడికి ప్రధాన బలంగా మారింది.

45
వెండిపై డిమాండ్

వెండి విషయంలో మాత్రం పరిస్థితి కొంత భిన్నంగా ఉంది. వెండికి పారిశ్రామిక రంగం నుంచి వచ్చే డిమాండ్ కీలకం కావడంతో తయారీ కార్యకలాపాల్లో మందగమనం ప్రభావం చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా చైనాలో సోలార్ మాడ్యూల్స్ వృద్ధి నెమ్మదిస్తే వెండి డిమాండ్‌పై ఒత్తిడి పెరగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

55
బంగారం రూ.1.70 లక్షలకు చేరే అవకాశం

ఇక 2026 చివరి నాటికి తులం బంగారం రూ.1.35 లక్షల నుంచి రూ.1.55 లక్షల పరిధిలో ఉంటుంందని అంచనా. అయితే అమెరికా లేబర్ మార్కెట్‌లో తీవ్ర బలహీనత ఏర్పడి, ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గించడం, రియల్ ఈల్డ్స్ పడిపోవడం, సంస్థాగత పెట్టుబడులు మళ్లీ బంగారం వైపు మళ్లడం వంటి పరిణామాలు చోటుచేసుకుంటే ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది.

అలాంటి అనుకూల పరిస్థితుల్లో తులం బంగారం ధర రూ.1,70,861 వరకు చేరే అవకాశం ఉందన్న అంచనా కూడా ఉంది. అయితే ఇది ఖచ్చితమైన ధర కాదని, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా మారితే సాధ్యమయ్యే ఒక అంచనాగా చూడాలని నిపుణులు సూచిస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories