షేర్ మార్కెట్ టుడే: లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్, నిఫ్టీ జంప్..

First Published Nov 3, 2021, 11:30 AM IST

దీపావళి పండుగ(diwali festival) రోజున దీపావళి బలిప్రతిపాదన సందర్భంగా నవంబర్ 4, 5న స్టాక్ మార్కెట్ (stock market)మూసివేయబడుతుంది. అయితే ప్రతి ఏడాదిలాగే దీపావళి రోజున  ముహూర్తపు ట్రేడింగ్ నిర్వహించనున్నారు. ఈ ప్రత్యేక ముహూర్తంలో షేర్లు కొనుగోలు చేయడం ద్వారా బంపర్ లాభాలను పొందవచ్చు.

స్టాక్ మార్కెట్ ఒక గంట పాటు ఓపెన్ 
దీపావళి రోజున స్టాక్ మార్కెట్ మూసివేసినప్పటికీ, సాయంత్రం ఒక గంట పాటు ముహూర్త ట్రేడింగ్ నిర్వహిస్తారు. ఈ ఒక గంటలో పెట్టుబడిదారులు చిన్న పెట్టుబడి పెట్టడం ద్వారా మార్కెట్ సంప్రదాయాన్ని అనుసరిస్తారు. ముహూర్తపు ట్రేడింగ్ సమయంలో స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ ఒక గంట ముహూర్తపు ట్రేడింగ్ సమయంలో చాలా మంది పెట్టుబడిదారులు షేర్లను కొనుగోలు చేస్తారు.

 గ్రహాల స్థితిని బట్టి ముహూర్తాన్ని
ఈ  బిజినెస్ చేసే సంప్రదాయం చాలా కాలంగా కొనసాగుతోంది. ప్రతి సంవత్సరం ముహూర్తపు ట్రేడింగ్ కోసం నిర్దిష్ట సమయం నిర్ణయించబడుతుంది. చిన్న, పెద్ద పెట్టుబడిదారులు ఈ శుభ సందర్భంగా విలువ ఆధారిత స్టాక్‌లను కొనుగోలు చేస్తారు వాటిని ఎక్కువ కాలంపాటు  ఉంచుతారు. ఒక నిర్దిష్ట ముహూర్తంలో గ్రహాల స్థానం ఈ సందర్భంగా పెట్టిన పెట్టుబడి లాభాలను ఇస్తుందని నమ్ముతారు. ఈసారి సంవత్ 2077 దీపావళితో ప్రారంభం కాబోతోంది.

ఈ నిర్దిష్ట సమయం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, ముహూర్తపు ట్రేడింగ్ రోజున, వ్యాపారులు పెట్టుబడిని అంచనా వేసిన తర్వాతే మార్కెట్లోకి ప్రవేశిస్తారు.  
 

ముహూర్తం ట్రేడింగ్ అంటే ఏమిటి 
పెట్టుబడిదారులు తరచుగా దీపావళి రోజున లక్ష్మీ దేవిని పూజిస్తారు అలాగే కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. హిందూ సంప్రదాయం ప్రకారం, దీపావళి పండుగ రోజున వ్యాపారాన్ని ప్రారంభించడం ద్వారా వ్యాపారులు ఏడాది పొడవునా లాభాలను ఆర్జించవచ్చని నమ్మకం. దీపావళి హిందూ అకౌంటింగ్ సంవత్సరం సంవత్ ప్రారంభాన్ని సూచిస్తుంది, వ్యాపారులు ఈ రోజున వారి ఖాతా బుక్ లను పూజిస్తారు. స్టాక్ మార్కెట్‌లో కూడా బ్రోకర్లు ముహూర్తపు ట్రేడింగ్‌కు ముందు ఖాతాల బుక్ లను పూజిస్తారు, దీనిని 'చోప్రా పూజ' అంటారు.

దీపావళికి ఒకరోజు ముందు స్టాక్ మార్కెట్‌లో ఉత్కంఠ నెలకొంది. బాంబే స్టాక్ ఎక్చేంజ్ ప్రధాన సూచీ సెన్సెక్స్ (బీఎస్ఈ సెన్సెక్స్) మూడో ట్రేడింగ్ రోజైన బుధవారం 282.15 పాయింట్ల లాభంతో 60,311.21 వద్ద ప్రారంభమైంది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ నిఫ్టీ) నిఫ్టీ కూడా ఈరోజు 84.20 పాయింట్ల లాభంతో 17973.15 స్థాయి వద్ద ప్రారంభమైంది. సెన్సెక్స్ కంపెనీలలో టెక్ మహీంద్రా షేర్ అత్యధికంగా రెండు శాతం పెరిగింది. ఎల్ అండ్ టీ, ఎన్‌టీపీసీ, బజాజ్ ఫైనాన్స్, ఎస్‌బీఐ, అల్ట్రాటెక్ సిమెంట్ కూడా లాభపడ్డాయి.

మరోవైపు సన్ ఫార్మా, టైటాన్, ఏషియన్ పెయింట్స్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, హిందుస్థాన్ యూనిలీవర్ నష్టపోయాయి. గత ట్రేడింగ్ సెషన్‌లో సెన్సెక్స్ 109.40 పాయింట్లు లేదా 0.18 శాతం నష్టంతో 60,029.06 పాయింట్ల వద్ద ముగిసింది. అలాగే నిఫ్టీ కూడా 40.70 పాయింట్లు లేదా 0.23 శాతం క్షీణించి 17,888.95 వద్ద ఉంది.

click me!