సరికొత్త రికార్డు దిశగా పయనిస్తున్న బంగారం, వెండి ధరలు.. నేడు ఎంత పెరిగిందో తెలుసా..?

First Published Nov 17, 2021, 1:31 PM IST

న్యూఢిల్లీ: పెళ్లిళ్ల సీజన్‌ ప్రారంభం కావడంతో  బంగారం, వెండికి డిమాండ్‌ మరింత పెరిగింది. అయితే బంగారం ధర మాత్రం సరికొత్త రికార్డు దిశగా సాగుతోంది. ఈరోజు మళ్లీ మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో డిసెంబర్‌లో  బంగారం(gold) ధర 0.14 శాతం పెరిగింది. మరోవైపు వెండి (silver)ధర కూడా 0.28 శాతం పెరిగింది. నవంబర్ 10న 10 గ్రాముల బంగారం ధర రూ.48,313గా ఉండగా, కిలో వెండి ధర రూ.64,692గా ఉంది. 
 

కొత్త రికార్డు దిశగా పయనిస్తున్న బంగారం!
పండగ సీజన్ ముగిసింది. అయితే బంగారం కొనుగోళ్లకు ప్రత్యేక పండుగ అయిన దీపావళి నాడు బంగారం అమ్మకాలు జోరుగా సాగాయి. పండుగ తర్వాత ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్‌ మొదలైంది. ఇలాంటి పరిస్థితుల్లో బంగారం, వెండి ధరలు పెరుగుతాయని ముందే ఊహించారు. 10 గ్రాముల బంగారం ధర ఇప్పుడు రూ.50,000కి చేరువలో ఉంది.

బంగారం, వెండి ధరలను పరిశీలిస్తే మల్టీ-కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో ఉదయం 9:45 గంటలకు గోల్డ్ ఫ్యూచర్స్ 0.14 శాతం పెరిగి 10 గ్రాములకు రూ.49,109కి చేరుకోగా, వెండి కిలోగ్రాముకు 0.28 శాతం పెరిగి రూ.66,419కి చేరుకుంది.

పృథ్వీ ఫిన్‌మార్ట్ కమోడిటీ రీసెర్చ్ నుండి మనోజ్ కుమార్ జైన్  మాట్లాడుతూ, ఈ రెండు విలువైన లోహాలు నేటి (నవంబర్ 17) సెషన్‌లో అస్థిరంగా ఉంటాయని  ఆశిస్తున్నామని చెప్పారు. జైన్ ప్రకారం బంగారం ట్రాయ్ ఔన్స్‌కు  1832 డాలర్లు (రూ. 1,36198.02), వెండి ట్రాయ్ ఔన్స్ 24.50 డాలర్లు (రూ. 1821.43) ఉండవచ్చు. అని అన్నారు.

ఇండియన్ బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ ప్రకారం, స్పాట్ మార్కెట్‌లో అత్యధిక స్వచ్ఛత కలిగిన బంగారం 10 గ్రాముల ధర రూ.49,553గా ఉంది. దీపావళి తర్వాత, సమీక్షలో ఉన్న కాలంలో బంగారం ధర 10 గ్రాములకు రూ. 1,850 కంటే ఎక్కువ పెరిగింది, వెండి కిలోకు రూ. 3,300 పెరిగింది.

ఈక్విటీస్ వ్యవస్థాపకుడు అండ్ డైరెక్టర్, మనోజ్ దాల్మియా మాట్లాడుతూ భవిష్యత్తులో బంగారం చాలా బుల్లిష్‌గా ఉంటుందని సూచించే అనేక సాంకేతిక ఆధారాలు ఉన్నాయి అని చెప్పారు.  

Paytm gold offer

షేర్‌ఇండియా వైస్ ప్రెసిడెంట్ & రీసెర్చ్ హెడ్ రవి సింగ్ మాట్లాడుతూ అమెరికా బాండ్ ఈల్డ్‌లు పెరగడం ఇంకా డాలర్ బలంగా ఉండటం వల్ల నవంబర్ 16న బంగారం ధరలు తగ్గాయని అభిప్రాయపడ్డారు. 

ఈ విధంగా మీరు బంగారం స్వచ్ఛతను తనిఖీ చేయవచ్చు
మీరు ఇప్పుడు బంగారం స్వచ్ఛతను తనిఖీ చేయాలనుకుంటే దీని కోసం ప్రభుత్వం ఒక యాప్‌ను రూపొందించింది. 'బిఐఎస్ కేర్ యాప్'తో వినియోగదారులు బంగారం స్వచ్ఛతను చెక్ చేసుకోవచ్చు. ఈ యాప్ ద్వారా బంగారం స్వచ్ఛతను సరిచూసుకోవడమే కాకుండా దానికి సంబంధించిన ఎలాంటి ఫిర్యాదునైనా చేయవచ్చు.

మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా బంగారం ధర 
మీరు ఇంట్లో కూర్చొని  సులభంగా పసిడి ధరలను కనుగొనవచ్చు. దీని కోసం మీరు 8955664433 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వండి. మీ ఫోన్‌కు మెసేజ్ వస్తుంది, దీనిలో మీరు తాజా ధరలను తనిఖీ చేయవచ్చు.

హైద‌రాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 46,150 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ. 50,350 కి చేరుకుంది.

click me!