కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ ప్రభుత్వం న్యూ ఇయర్ గిఫ్ట్.. హెచ్‌ఆర్‌ఏ భారీగా పెంపు..?

First Published Nov 16, 2021, 5:06 PM IST

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలో రానున్న కొత్త సంవత్సరంలో శుభవార్త అందనుంది. కొన్ని నివేదికల ప్రకారం ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం జనవరి 2022 ప్రారంభంలో హౌస్ రెంట్ అలవెన్స్ (HRA) పెంపుపై కీలక నిర్ణయం ప్రకటించనుంది.

గత వారం ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల హెచ్‌ఆర్‌ఏ( HRA) పెంచడానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇప్పటికే ప్రణాళికను ప్రారంభించింది, ఈ చర్య భారతీయ రైల్వేలో పనిచేస్తున్న 11.56 లక్షల మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుస్తుందని అంచనా. 

ఇండియన్ రైల్వే టెక్నికల్ సూపర్‌వైజర్స్ అసోసియేషన్ అండ్ నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రైల్వేమెన్ 1 జనవరి  2021 నుండి 7వ వేతన సంఘం సిఫార్సుల ఆధారంగా హెచ్‌ఆర్‌ఏను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్న విషయం గుర్తుండే ఉంటుంది. ఇంటి అద్దె భత్యం( HRA)  పెంచిన తర్వాత జీతంలో భారీగా పెరుగుదల ఉంటుంది.

7వ పే కమీషన్ ఆధారంగా హౌస్ రెంట్ అలవెన్స్  (HRA) లెక్కింపు
హెచ్‌ఆర్‌ఏ  X నగరాలకు 24%, Y నగరాలకు 16% & Z 8%  నగరాలకు చెల్లించబడుతుంది. హెచ్‌ఆర్‌ఏ X నగరాలకు రూ. 5400, Y నగరాలకు రూ. 3600, Z నగరాలకు రూ.1800 కంటే తక్కువ ఉండకూడదు, కనీస వేతనం రూ. 18,000లో @30 శాతం, 20 శాతం ఇంకా 10 శాతంగా లెక్కించబడుతుంది.

7వ సి‌పి‌సి కూడా డి‌ఏ 50% & 100%కి చేరుకున్నప్పుడు హెచ్‌ఆర్‌ఏని సవరించాలని సిఫార్సు చేసింది, డి‌ఏ వరుసగా 25% ఇంకా 50% దాటినప్పుడు రేట్లను సవరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

click me!